గోవా సీఎం ప్రమోద్ సావంత్ రాజీనామా

గోవా సీఎం ప్రమోద్ సావంత్ రాజీనామా

గోవా సీఎం ప్రమోద్ సావంత్ రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో కొత్త సర్కారు కొలువుదీరేందుకు వీలుగా పదవికి రాజీనామా చేశారు. రాజ్ భవన్కు వెళ్లిన సావంత్.. రాజీనామా లేఖను గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లైకు అందజేశారు. గవర్నర్ కోరిక మేరకు కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టే వరకు ప్రమోద్ సావంత్ ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు.

40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ 20 సీట్లు గెల్చుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే మేజిక్ ఫిగర్కు కేవలం ఒక్క సీటు దూరంలో నిలిచింది. దీంతో ముగ్గురు ఇండిపెండెంట్ లతో పాటు మహారాష్ట్ర గోమంతక్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ప్రకటించారు. దీంతో బీజేపీ కూటమి బలం 25కు చేరింది.  త్వరలోనే గోవాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరే అవకాశముంది.

మరిన్ని వార్తల కోసం..

రంగంలోకి దిగిన ‘వలీ’.. రష్యన్ బలగాల్లో దడ

ఉద్యోగులకు షాకిచ్చిన ఈపీఎఫ్ఓ