గోవాలో ప్రభుత్వ అధీనంలోకి ప్రైవేటు ఆస్పత్రులు

గోవాలో ప్రభుత్వ అధీనంలోకి ప్రైవేటు ఆస్పత్రులు

సెకండ్ వేవ్ తో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో వైరస్ సోకిన బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకునేందుకు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సకు ఫీజులు చెల్లించలేక నానా ఇక్కట్లు పడుతున్నారు. ఈ క్రమంలోనే గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని కరోనా ట్రీట్మెంట్ కు కేటాయించిన 21 ప్రైవేటు ఆస్పత్రులను ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. సోమవారం నుంచి ఈ ఆస్పత్రులన్నీ ప్రభుత్వ అధీనంలో పనిచేస్తాయని గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ ప్రకటించారు. ఈ ఆస్పత్రుల్లో కొవిడ్‌ బాధితుల వైద్యానికి అయ్యే ఖర్చు ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. ఆయా ఆస్పత్రుల్లో సిబ్బంది ఎప్పటిలాగే కొనసాగుతారని.. నియంత్రణ మాత్రమే ప్రభుత్వానిదని చెప్పారు. అంతేకాదు ప్రతి ఆస్పత్రిని ఒక ప్రభుత్వ అధికారి పర్యవేక్షిస్తారని చెప్పారు. కరోనా పేషెంట్ల కోసం 50 శాతం పడకలు కేటాయించాలన్న రూల్ అమలు చేయని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు సీఎం ప్రమోద్‌ సావంత్‌.