పటేల్ బతికుంటే మరింత ముందుగానే గోవాకు విముక్తి

పటేల్ బతికుంటే మరింత ముందుగానే గోవాకు విముక్తి

పనాజీ: మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ బతికుంటే గోవాకు ఇంకాస్త ముందుగానే లభించేదని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. పనాజీలో నిర్వహించిన గోవా 60వ లిబరేషన్ డే వేడుకల్లో పాల్గొన్నారు మోడీ. స్వాతంత్ర్య సమరయోధులు, ఆపరేషన్ విజయ్ లో పాల్గొన్న జవాన్లను సన్మానించారు. అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆజాద్ మైదానంలో అమరవీరులకు నివాళులర్పించారు ప్రధాని మోడీ.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ ఎక్కువ కాలం పోర్చుగీస్ పాలనలో ఉన్నప్పటికీ గోవా భారతీయతను కోల్పోలేదన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అలాగే భారత్ కూడా గోవాను మరిచిపోలేదని చెప్పారు. కొద్దికాలం క్రితం తాను వాటికన్ సిటీ వెళ్లినప్పుడు పోప్ ఫ్రాన్సిన్ ను కలసి భారత్ కు ఆహ్వానించిన విషయం గుర్తు చేశారు. భారత్ కు రావాలనే ఆహ్వానం తనకు వచ్చిన అతిపెద్ద గిఫ్ట్ అని పోప్ చెప్పారని మోడీ తెలిపారు. మాజీ సీఎం మనోహర్ పారికర్... తన జీవితాన్ని గోవాకు అంకితం చేశారని చెప్పారు. 

 

 

ఇవి కూడా చదవండి

ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య

వరి వేయొద్దంటున్నారు.. ఏ పంట వేయాలో అర్థం కావడం లేదు

ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య