కరీంనగర్‌‌‌‌ కమిషనరేట్ పరిధిలో ..పెండింగ్ కేసుల పరిష్కారమే లక్ష్యం : సీపీ గౌష్ ఆలం

కరీంనగర్‌‌‌‌ కమిషనరేట్ పరిధిలో ..పెండింగ్ కేసుల పరిష్కారమే లక్ష్యం : సీపీ గౌష్ ఆలం

కరీంనగర్ క్రైం,వెలుగు: కరీంనగర్‌‌‌‌ కమిషనరేట్ పరిధిలోని పెండింగ్ కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలని సీపీ గౌష్ ఆలం పోలీస్‌‌ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం కమిషనరేట్ కేంద్రంలో క్రైమ్‌‌ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. శాంతిభద్రతలు, పెండింగ్ కేసుల దర్యాప్తు, న్యూ ఇయర్‌‌‌‌ వేడుకల భద్రతా ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్తి సంబంధిత నేరాలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, పోక్సో కింద నమోదైన కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. సైబర్ క్రైమ్ రిపోర్టింగ్, సీసీ టీవీ కెమెరాల జియో-ట్యాగింగ్‌‌పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ఆన్‌‌లైన్ ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని  సూచించారు. 

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని  ఆదేశించారు. సమావేశంలో ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్, అడిషన్‌‌ డీసీపీలు వెంకటరమణ, భీంరావు , ఏసీపీలు శ్రీనివాస్ , మాధవి, విజయకుమార్ , వెంకటస్వామి, సతీశ్‌‌కుమార్‌‌‌‌, తదితరులు  పాల్గొన్నారు.