నా బిడ్డ నడుస్తోందోచ్

నా బిడ్డ నడుస్తోందోచ్

ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ ఫర్ఫెక్ట్.. నిరంతర సాధన ద్వారా మనలో పరిపూర్ణత వస్తుందని అర్థం . ప్రాక్టీస్‌‌ మేక్స్‌ యానిమల్‌‌ ఫర్‌ ఫెక్ట్‌.. అంటే మూ గజీవాలు కూడా సాధనతో రాటుదేలతాయని అర్థం . అప్పుడప్పుడు కొన్ని ఘటనలు ఈ సంగతిని నిరూపిస్తున్నాయి .అసలు విషయానికి వస్తే.. బీహార్‌ లోని బెగుసరై జిల్లా మటిహాని మండల పరిధి లోని రా మ్‌ దిరి గ్రామం. చుట్టుపక్కల ఊళ్లలోని జనాలంతా రామ్‌ దిరి శివారులోని పంట పొలానికి పరుగులు తీస్తున్నారు. ఏదో అద్భుతం జరుగుతున్నట్లు అక్కడంతా గుమిగూడారు. అందుకు కారణం మనిషిలా రెండు కాళ్లతో నడుస్తున్న ఒక మేక పిల్ల.ఆ ఆడ మేకపిల్లకు పుట్టుకతోనే పక్షవాతం సోకింది. ఆ కా రణంతో ముందటి కా ళ్లు చచ్చుబడిపోయాయి. దాని యాజమాని లోకేష్‌ మిశ్రా వెటర్నరీ ఆస్పత్రుల చుట్టూ తిప్పినా ప్రయోజనం లేకపోయింది. అయినా కూడా దానిని సొంత బిడ్డలా చూసుకున్నాడతను. అంతా అది చనిపోతుందని అనుకున్నా రు. కానీ, అయితే ఆ మేకపిల్ల బతకడానికి పోరాటం చేసిం ది. వెనుక కా ళ్లతో మెల్లగా నడవడం సాధన చేసింది. ఉన్నట్లుండి ఒక రోజు పరుగులు తీయడం మొదలుపెట్టింది. మేకపిల్ల అలా నడుస్తుం డటంతో లోకేష్‌ ఆశ్చర్యపోయాడు. ఫొటోలు తీసి వాట్సాప్‌ లో వైరల్‌‌ చేశాడు. మనిషిలా నడుస్తున్న మేకపిల్ల అనే వార్త చుట్టుపక్కల ఊళ్లకు పాకింది. జనాలంతా ఆ వింతను చూసేందుకు ఎగబడిపోతున్నారు. క్యూ ట్‌ గా అది నడుస్తుంటే పిల్లలు దానితో ఫోటోలు తీసుకుంటున్నా రు. ఆ బిడ్డ కడుపులో ఉండగా తల్లి మేకకు దెబ్బలు తాకి ఉంటాయని, బహుశా అందుకే ఆ పిల్లకు పక్షవాతం సోకి ఉంటుందని వెటర్నరీ వైద్యులు చెప్తున్నా రు.