
తెలంగాలణతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. నిర్మల్ జిల్లా బాసరలో ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. క్షణంక్షణం వరదనీరు పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
భారీ వరదల కారణంగా బాసర వద్ద పూర్తిగా ప్రవాహ స్థాయిలో గోదారి ప్రవహిస్తోంది. నీటిమట్టం అంతకంతకూ పెరగటంతో పుష్కరఘాట్లు మునిగిపోయాయి. దీంతో గోదావరిలో పుణ్య స్నానాలను నిషేధించారు పోలీసులు.
►ALSO READ | సాయుధ పోరాట స్ఫూర్తితోనే నియంత పాలన నుంచి విముక్తి : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఏ సమయంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. గోదావరి పరివాహక ప్రాంతం వైపు వెళ్లవద్దని పశువులకాపరులను, మేకల కాపరులకు హెచ్చరించారు.