
నిర్మల్జిల్లాలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆదివారం (సెప్టెంబర్28) సరస్వతి అమ్మవారి పుణ్య క్షేత్రం అయిన బాసరలో ఉగ్రరూపం దాల్చింది. క్షణక్షణం పెరుగుతున్న నీటిమట్టంతో బాసరలోని బ్రిడ్జీని తాకే స్థాయికి వరద ప్రవహిస్తుంది. మూడు ఫీట్లు పెరిగితే బ్రిడ్జీని తాగే అవకాశం ఉంది.
గోదావరి ఉగ్రరూపంతో బాసరలోని పుష్కర ఘాట్లు, నిత్య హారతి శివలింగాలు నీట మునిగాయి. అమ్మవారి ఆలయానికి వెళ్లే దారివరద నీటితో చెరువులా తలపిస్తోంది. ఆలయానికి వెళ్లే దారితో లాడ్జీలు, గెస్ట్ హౌజ్లలోకి వరద నీరు చేరింది. దీంతో లాడ్జీలను ఖాళీ చేయించారు యజమానులు.
మరోవైపు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది.. పుష్కర ఘాట్లలో పుణ్య స్నానాలకు వెళ్లొద్దని జిల్లా ఎస్పీ జానకి షర్మిల హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు పోలీసులు.
►ALSO READ | తిరుమలలో లక్ష మంది భక్తులు.. మరో 2 లక్షల మంది వచ్చే అవకాశం.. కారణం ఏంటంటే..