
ఇండోనేషియా కరెన్సీలా మన దేశ కరెన్సీ పైనా దేవుళ్ల బొమ్మలు ముద్రిస్తే మంచి జరుగుతుందన్నారు బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇండోనేషియా కరెన్సీపై గణేశుని బొమ్మ ప్రింట్ చేయడాన్ని విలేకరులు ఆయనతో ప్రస్తావించారు. దీంతో ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి మోడీ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలన్నారు. అంతేకాదు నోట్లపై దేవుళ్ల బొమ్మలు ముద్రించడానికి తాను పూర్తిగా అనుకూలంగా ఉన్నట్టు చెప్పారు. భారత కరెన్సీపై లక్ష్మీదేవి బొమ్మను ప్రింట్.. మన కరెన్సీ పరిస్థితి మెరుగవుతుందన్నారు. ఈ విషయంలో ఎవరూ చెడుగా భావించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు సుబ్రహ్మణ్యస్వామి.