భగ్గుమన్న బంగారం ధరలు..హైదరాబాద్​లో రూ.74,130

భగ్గుమన్న బంగారం ధరలు..హైదరాబాద్​లో రూ.74,130

న్యూఢిల్లీ : బంగారం, వెండి ధరలు మంగళవారం సరికొత్త గరిష్ట స్థాయిలను తాకాయి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతాయనే భయాల మధ్య అంతర్జాతీయ మార్కెట్లలో పసిడికి రెక్కలు వచ్చాయి.   మంగళవారం దేశ రాజధానిలో బంగారం ధరలు రూ.700 పెరిగి 10 గ్రాముల జీవితకాల గరిష్ట స్థాయి రూ.73,750కి చేరాయి. సోమవారం 10 గ్రాముల ధర రూ.73,050 వద్ద ముగిసింది.

కిలో వెండి ధర రూ.800 ఎగిసి రికార్డు స్థాయిలో రూ.86,500కి చేరుకుంది.  హైదరాబాద్​లో మంగళవారం పది గ్రాముల బంగారం ధర  రూ.74,130 పలికింది. గ్లోబల్ మార్కెట్లలో కమోడిటీ ఎక్స్చేంజ్​ వద్ద స్పాట్ బంగారం ఔన్సుకు (దాదాపు 28 గ్రాములు)  2,370 డాలర్ల (దాదాపు రూ.19.8 లక్షలు) వద్ద ట్రేడవుతోంది.