వారం తర్వాత కేజీకి రూ.5వేలు తగ్గిన వెండి.. బంగారం రేటు గ్రాముకు ఎంత తగ్గిందంటే?

వారం తర్వాత కేజీకి రూ.5వేలు తగ్గిన వెండి.. బంగారం రేటు గ్రాముకు ఎంత తగ్గిందంటే?

దేశీయంగా బంగారం, వెండి ధరలు వారాంతం నాటికి మరింతగా తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా బులియన్ మార్కెట్లలో ధరలు తగ్గుతుండటంపై సామాన్య మధ్యతరగతి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆభరణాలు షాపింగ్ చేయాలనుకుంటున్న వ్యక్తులు ముందుగా తమ సమీప నగరాల్లో మారిన రేట్లను పరిశీలించండి. 

జూన్ 5న బంగారం రేట్లు తగ్గాయి. జూన్ 4 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.38 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 573గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 275గా కొనసాగుతోంది. 

శుక్రవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. జూన్ 5, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.5వేలు తగ్గింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.5వేలు తగ్గి రూ.2లక్షల 80వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.280 దగ్గర ఉంది.