బంగారం, వెండి ధరలు తగ్గే ఛాన్స్!

బంగారం, వెండి ధరలు తగ్గే ఛాన్స్!

న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రకటించిన బడ్జెట్‌‌లో బంగారం, వెండిపై కస్టమ్ డ్యూటీ తగ్గించే చాన్సెస్ ఉన్నాయని తెలిపారు. ఒకవేళ కస్టమ్ డ్యూటీ తగ్గిస్తే పసిడి, వెండి ధరలు తగ్గుతాయి. ‘ప్రస్తుతం బంగారం, వెండి మీద కస్టమ్ డ్యూటీ 12.5 శాతంగా ఉంది. 2019 జూలైలో 10 శాతంగా ఉన్న కస్టమ్ డ్యూటీ ఆ తర్వాత పెరిగింది. పసిడి ధరలో తగ్గుదల రావాల్సిన ఆవశ్యకత ఉంది. అందుకే గోల్డ్, సిల్వర్‌పై కస్టమ్ డ్యూటీని స్థిరీకరిద్దామని చూస్తున్నాం’ అని బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో నిర్మలా సీతారామన్ తెలిపారు.

పూర్తి బడ్జెట్‌‌ను మంగళవారం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పసిడి, వెండి ధరల తగ్గుదలపై రేపే స్పష్టత రానుంది. కాగా, సోలార్‌ ఇన్వర్టర్‌ల ధరలు పెరగొచ్చని విశ్వసనీయ సమాచారం. ఆటోమొబైల్‌ రంగంలో కస్టమ్‌ డ్యూటీ పెంపు ఉంటుందని తెలుస్తోంది. కార్ల విడిభాగాల ధరలు కూడా పెరుగుతాయని అంచనా. వీటితోపాటు దిగుమతి చేసుకునే ప్రీమియం దుస్తులు, లెదర్‌ ఉత్పత్తులు, మొబైల్స్ ధరలు పెరగొచ్చునని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.