Gold Rate: లక్ష దాటాక స్పీడు పెంచిన గోల్డ్.. వెండి కేజీ రూ.లక్ష 28వేలు, హైదరాబాద్ రేట్లివే..

Gold Rate: లక్ష దాటాక స్పీడు పెంచిన గోల్డ్.. వెండి కేజీ రూ.లక్ష 28వేలు, హైదరాబాద్ రేట్లివే..

Gold Price Today: ప్రస్తుతం దేశంలో తులం బంగారం 24 క్యారెట్ల ధర లక్ష దాటిన తర్వాత కూడా భారీ ర్యాలీని చూస్తోంది. దీంతో పెట్టుబడిదారులు కొనడానికి వెనుకంజ వేస్తున్నారు. ఇదే క్రమంలో రిటైల్ ఆభరణాల అమ్మకాలు కూడా భారీగా తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. చాలా మంది రేట్ల తగ్గింపుల కోసం ఎదురుచూసే ధోరణిలో ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. 

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.10వేల 500 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 285, ముంబైలో రూ.9వేల 285, దిల్లీలో రూ.9వేల 300, కలకత్తాలో రూ.9వేల 285, బెంగళూరులో రూ.9వేల 285, కేరళలో రూ.9వేల 285, పూణేలో రూ.9వేల 285, వడోదరలో రూ.9వేల 290, అహ్మదాబాదులో రూ.9వేల 290, జైపూరులో రూ.9వేల 300, లక్నోలో రూ.9వేల 300, మంగళూరులో రూ.9వేల 285, నాశిక్ లో రూ.9వేల 288, మైసూరులో రూ.9వేల 285, అయోధ్యలో రూ.9వేల 300, బళ్లారిలో రూ.9వేల 285, నోయిడాలో రూ.9వేల 300, గురుగ్రాములో రూ.9వేల 300 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.11వేల 400 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.10వేల 129, ముంబైలో రూ.10వేల 129, దిల్లీలో రూ.10వేల 144, కలకత్తాలో రూ.10వేల 129, బెంగళూరులో రూ.10వేల 129, కేరళలో రూ.10వేల 129, పూణేలో రూ.10వేల 129, వడోదరలో రూ.10వేల 134, అహ్మదాబాదులో రూ.10వేల 134, జైపూరులో రూ.10వేల 144, లక్నోలో రూ.10వేల 144, మంగళూరులో రూ.10వేల 129, నాశిక్ లో రూ.10వేల 134, మైసూరులో రూ.10వేల 129, అయోధ్యలో రూ.10వేల 144, బళ్లారిలో రూ.10వేల 129, నోయిడాలో రూ.10వేల 144, గురుగ్రాములో రూ.10వేల 144గా ఉన్నాయి. 

ALSO READ : ఎస్‌బీఐలో పెరిగిన ఎల్‌ఐసీ వాటా

ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.92వేల 850 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.లక్ష 12వేల 900గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.2వేలు పెరుగుదలతో నేడు రూ.లక్ష 28వేల వద్ద ఉంది.