సూర్యాపేట గ్రామీణ బ్యాంక్‌ను అప్రైజర్ మోసం చేశాడు. ఫేక్ గోల్డ్‌తో బినామీల పేరిట 21 లక్షల మోసానికి పాల్పడ్డాడు. రీ అప్రైజర్ తనిఖీల్లో సదరు అప్రైజర్ బాగోతం బయటపడింది. పోలీసులకు బ్యాంక్ అధికారులు ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. అప్రైజర్ ఉపేందర్ పరారీలో ఉన్నాడు.
గోల్డ్ అప్రైజర్ పనేంటంటే.. బంగారం స్వచ్ఛత, నాణ్యత, బరువు, మార్కెట్ విలువను అంచనా వేయడం. బ్యాంకులు కస్టమర్లకు గోల్డ్ లోన్ ఇచ్చే సమయంలో బంగారం అప్రైజర్ సేవలను ఉపయోగించుకుంటాయి. కస్టమర్ బ్యాంకులో బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకోవడానికి వచ్చినప్పుడు, అప్రైజర్ ఆ బంగారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దాని నాణ్యతను, క్యారెట్లను, నికర బరువును నిర్ధారిస్తారు.
బంగారం అప్రైజర్ మొదట బంగారం 22 క్యారెట్లా, 18 క్యారెట్లా లేదా ఇతర క్యారెట్లలో ఉందా అని పరీక్షిస్తారు. తర్వాత బంగారంలో ఉన్న రాళ్లు, ముత్యాలు, ఇతర లోహాలు లేదా అదనపు పదార్థాల బరువును మినహాయించి నికర బంగారం బరువును లెక్కిస్తారు. ఆ తర్వాత బ్యాంకు నిర్దేశించిన విధానాలు, ప్రస్తుత బంగారం ధర ఆధారంగా దాని విలువను అంచనా వేస్తారు. చివరగా బంగారం విలువకు సంబంధించిన నివేదికను బ్యాంకుకు అందజేస్తారు.
ఈ నివేదిక ఆధారంగా బ్యాంకు కస్టమర్‌కు ఎంత మొత్తంలో గోల్డ్ లోన్ ఇవ్వొచ్చో నిర్ణయిస్తుంది. బంగారం అప్రైజర్‌కు బ్యాంకులతో రెండు విధాలుగా సంబంధం ఉంటుంది. కొంతమంది బ్యాంకుల్లో ఉద్యోగులుగా పనిచేస్తుంటారు. మరికొంతమంది స్వతంత్రంగా పనిచేస్తూ బ్యాంకుల ప్యానెల్ అప్రైజర్లుగా నియమితులవుతారు.
