
న్యూఢిల్లీ: జేబులో ఉన్న రూ.100 నోటు ఎక్కడైనా పడిపోతేనే ఉక్కిరిబిక్కిరి అవుతాం. అలాంటిది మనం ప్రయాణించిన క్యాబ్‌లో లక్షల విలువ చేసే గోల్డ్, ఇతర విలువైన వస్తువులు మర్చిపోతే ఇంకా ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒక్కసారిగా గుండె ఆగినంత పనైపోతుంది. టెన్షన్, తొందర, మతిమరుపు వంటి కారణాల వల్ల మనం కొన్నిసార్లు ప్రయాణాల్లో వస్తువులను మర్చిపోవడం లేదా పొగుట్టుకోవడం జరుగుతుంటుంది.
ఈ క్రమంలోనే 2024లో తమ క్యాబ్ సర్వీసుల్లో వినియోగదారులు మర్చిపోయిన విలువైన వస్తువుల లాస్ట్ & ఫౌండ్ జాబితాను విడుదల చేసింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. బ్యాగులు, పర్సులు, కీ, కళ్ళజోడు, ఇయర్ ఫోన్లు, ఫోన్లు మర్చిపోవడం కామన్. కానీ కొంతమంది పెళ్లి చీర, బంగారు బిస్కెట్ వంటి అత్యంత విలువైన వస్తువులు క్యాబ్‌లో వదిలివెళ్లినట్లు ఉబెర్ వెల్లడించింది. తిరిగి ఆ వస్తువును మళ్లీ కస్టమర్లకు అందజేసినట్లు తెలిపింది.
క్యాబ్‌లో అత్యధికంగా వస్తువులు మర్చిపోయిన తొలి నగరంగా దేశ ఆర్థిక రాజధాని ముంబై నిలిచిందని నివేదిక స్పష్టం చేసింది. ముంబైలో చాలా మంది కస్టమర్లు తమ వస్తువులను క్యాబ్‌లో మర్చిపోయి వెళ్లినట్లు తేలింది. ఈ జాబితాలో రెండో ప్లేస్‌లో దేశ రాజధాని ఢిల్లీ నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో పూణే, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాలు ఉన్నాయి. హైదరాబాద్ కస్టమర్లు తమ వస్తువులను క్యాబ్‌లో చాలా తక్కువగా మర్చిపోతారని వెల్లడించింది. 2024లో ఎక్కువగా శనివారం రోజు కస్టమర్లు తమ వస్తువులను క్యాబ్‌లో మర్చిపోయి వెళ్లారని తేలింది.
ఉబర్ క్యాబ్‌లలో ప్రజలు మరచిపోయే టాప్ 10 వస్తువులు:
బ్యాక్‌ప్యాక్ / బ్యాగ్
ఇయర్ ఫోన్లు / స్పీకర్
ఫోన్
వాలెట్ / పర్స్
కళ్ళద్దాలు / సన్ గ్లాసెస్
కీలు
దుస్తులు
ల్యాప్‌టాప్
నీటి సీసా / సీసా
పాస్‌పోర్ట్