
భాగ్యనగర్ బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి శుక్రవారం బంగారు బోనం సమర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్ మాట్లాడుతూ.. సప్త మాతృకలకు సప్త బంగారు బోనం కార్యక్రమంలో భాగంగా పెద్దమ్మ తల్లికి ఈ బోనం సమర్పించామన్నారు. అంతకుముందు హరిబౌలి అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం జోగిని అవికా దేవి ఊరేగింపుగా వెళ్లి జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి బంగారు బోనం సమర్పించారు.