
- వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మరో సిరీస్ అందుబాటులోకి
న్యూఢిల్లీ: సావరిన్ గోల్డ్ బాండ్ల సిరీస్ 3, సిరీస్ 4 ఇష్యూల డేట్‌ను ప్రభుత్వం ప్రకటించింది. సిరీస్ 3 బాండ్లు ఈ నెల 18–22 మధ్య సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంటాయి. సిరీస్ 4 బాండ్ల ఇష్యూ వచ్చే ఏడాది ఫిబ్రవరి 12 న అందుబాటులోకి రానుంది. కమర్షియల్ బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కొన్ని పోస్ట్ ఆఫీస్‌ల నుంచి సావరిన్ గోల్డ్ బాండ్లను కొనుక్కోవచ్చు.
ఇండియన్లు, హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీస్, ట్రస్ట్‌లు, యూనివర్సిటీలు, చారిటబుల్ ఇన్‌స్టిట్యూషన్లు మాత్రమే సావరిన్ గోల్డ్ బాండ్లను కొనడానికి వీలుంటుంది. కనీసం ఒక గ్రాము గోల్డ్ బాండ్ కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోవాలి. బాండ్లు 8 ఏళ్లలో మెచ్యూర్ అవుతాయి. బయటకి వచ్చేయాలనుకుంటే ఐదో ఏట నుంచి అవకాశం ఉంటుంది. గరిష్టంగా ఇండివిడ్యువల్స్ 4 కేజీలకు, హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీస్ 4 కేజీలకు, ట్రస్ట్‌లు, ఇలాంటి సంస్థలు 20 కేజీలకు సబ్‌స్క్రయిబ్ అవ్వొచ్చు. ఈ సావరిన్ గోల్డ్ బాండ్లపై ఏడాదికి 2.5 శాతం వడ్డీ వస్తుంది.