క్రిస్మస్ నాటికి బంగారం మెరుపులు

క్రిస్మస్ నాటికి బంగారం మెరుపులు

న్యూఢిల్లీ :  బంగారం ధరల దడ కొనసాగుతుందని వ్యాపారులు అంటున్నారు. 2005లో రూ.7వేలుగా ఉన్న 10 గ్రాముల బంగారం ధర… ఇప్పుడైతే ఏకంగా రూ.40 వేల మార్క్ ను క్రాస్ చేసి మెరిసిపోతోంది. అంతర్జాతీయంగా ట్రేడ్ వార్ టెన్షన్లు, ఎగుమతులు తగ్గడం, ఆర్థిక మాంద్య భయాలు బంగారానికి భలే జోష్‌‌నిస్తున్నాయి. అంతర్జాతీయంగా కూడా బంగారం ధర ఒక ఔన్స్‌‌కు 1,500 డాలర్ల మార్క్‌‌ను క్రాస్ చేసి ఆరేళ్ల గరిష్టాన్ని తాకింది. అమెరికన్ ఈక్విటీ మార్కెట్ బెంచ్‌‌మార్క్‌‌ వద్ద ఒక టెక్నికల్ లెవల్‌‌ను దాటాక.. గోల్డ్ కంటిన్యూగా ర్యాలీనే జరుపుతుందని సిటీగ్రూప్ ఇంక్ అంచనావేస్తోంది. క్రిస్మస్​ వరకు ఈ పెంపు ఉంటుందని, మరో 25 శాతం వరకు  పెరుగుతుందని టెక్నికల్ స్ట్రాటజిస్ట్ శ్యామ్ దేవాని అన్నారు. సెంట్రల్ బ్యాంక్‌‌ల కొనుగోళ్లు, బులియన్ బ్యాక్డ్ ఎక్సేంజ్ ట్రేడడ్ ఫండ్స్ వంటి కారణాలతో అంతర్జాతీయంగా బంగారం ధర 1,650 డాలర్లను చేరుకుంటుందన్నారు.