44 ఏళ్ల తర్వాత హాకీలో గోల్డ్.. స్వర్ణం గెలిచిన మహిళల టీమ్

44 ఏళ్ల తర్వాత హాకీలో గోల్డ్.. స్వర్ణం గెలిచిన మహిళల టీమ్
  • బాక్సింగ్‌‌‌‌లో హ్యాట్రిక్‌‌‌‌ గోల్డ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌
  • రెజ్లింగ్‌‌‌‌లో ఒక గోల్డ్‌‌‌‌, ఆర్చరీలో గోల్డ్,  సిల్వర్‌‌‌‌

కాకామిగహర: ఆసియా క్రీడల విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాకీలో ఇండియా జట్టు 44 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో ఇండియా 1–0తో డిఫెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఒలింపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిల్వర్ మెడలిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైనాను ఓడించి స్వర్ణంతో మెరిసింది. అలాగే 2028 లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏంజిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నేరుగా అర్హత సాధించింది. 10వ నిమిషంలో లాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెమ్సియామి రివర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కొట్టిన అద్భుతమైన గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇండియా ఆధిక్యంలోకి వెళ్లింది.

దీన్ని గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిచుదేవి వీరోచిత ప్రదర్శనతో చివరి వరకు కాపాడింది. మధ్యలో రక్షణశ్రేణి  చైనా ఎదురుదాడులకు దీటుగా నిలవడంతో ఇండియాకు చిరస్మరణీయ విజయం సొంతమైంది. కీలక విజయంతో ఇండియా ఒకేసారి రెండు లక్ష్యాలను నెరవేర్చుకుంది. 1982 ఆసియా క్రీడల తర్వాత విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తొలి స్వర్ణం గెలవడంతో పాటు ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధించడం అతి గొప్ప విశేషం. జట్లు ప్రయాణించిన బస్సులు ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చిక్కుకోవడంతో ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్ణీత టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంటే గంట ఆలస్యంగా మొదలైంది.

కానీ పోటీ మొదలయ్యాక ఇండియా ఫార్వర్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆరంభంలోనే బలమైన ముద్ర వేశారు. ఆపై చైనా విసిరిన ప్రతి సవాలును అద్భుతంగా తిప్పికొట్టారు. 10వ నిమిషంలో సాక్షి రాణా సర్కిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి పంపిన పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమీపంలోనే ఉన్న లాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెమ్సియామి అందుకుని రివర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి పంపింది. ఆట ప్రారంభంలో చైనా ఎక్కువసేపు బంతిని ఆధీనంలో ఉంచుకుంది. ఆరో నిమిషంలో బల్జీత్ కౌర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గ్రీన్ కార్డ్ చూపించడంతో, రెండు నిమిషాల పాటు ఒక క్రీడాకారిణి కొరత ఏర్పడింది.

దాంతో  పోటీ చాలావరకు మిడ్-ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే పరిమితమైంది. 18వ నిమిషంలో చైనాకు తొలి పెనాల్టీ కార్నర్ లభించినా విజయవంతం కాలేదు. 24వ నిమిషంలో లాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెమ్సియామి వెనుకనుండి ఒక ఫార్వర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అడ్డుకున్నందుకు పెనాల్టీ విధించడంతో చైనాకు మళ్లీ అవకాశం వచ్చింది.  గోల్ కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిచుదేవి నిలువరించింది. రెండో అర్ధభాగంలోనూ చైనా గోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడానికి పెనాల్టీలను సృష్టించినా.. పెద్దగా సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేదు. 

  • ప్లేయర్లకు రూ. 11 లక్షలు

చారిత్రాత్మక గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలిచిన జట్టు సభ్యులకు హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. జట్టులోని ప్రతి ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ. 11 లక్షలు, సపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తలా రూ. 5.5 లక్షల చొప్పున నగదు బహుమతిని అందజేయనున్నారు.