అండర్‌‌–20 రెజ్లింగ్ వరల్డ్ చాంపియన్షిప్‌.. కాజల్కు స్వర్ణం

అండర్‌‌–20 రెజ్లింగ్ వరల్డ్ చాంపియన్షిప్‌.. కాజల్కు స్వర్ణం

బ్రాటిస్లావా (స్లొవేకియా): ఇండియా యంగ్ రెజ్లర్‌‌ కాజల్‌‌ ధోచక్‌‌.. అండర్‌‌–20 రెజ్లింగ్‌‌ వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో వరుసగా రెండోసారి స్వర్ణ పతకం గెలిచింది. శుక్రవారం జరిగిన విమెన్స్‌‌ 76 కేజీ ఫైనల్లో కాజల్‌‌ 7–0తో జింగ్రు సున్‌‌ (చైనా)పై గెలిచింది. బౌట్‌‌ ఆరంభం నుంచి అద్భుతమైన పట్టుతో ఆకట్టుకున్న కాజల్‌‌.. ప్రత్యర్థికి ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు.

ఈ టోర్నీలో కాజల్‌‌ ఒక్క పాయింట్‌‌ కూడా కోల్పోకుండా టైటిల్‌‌ గెలవడం మరో విశేషం. గతేడాది కూడా ఈ టోర్నీలో కాజల్‌‌ టైటిల్‌‌ను సాధించింది. విమెన్స్‌‌ 72 కేజీల ఫైనల్లో తను శర్మ 3–5తో చిసాటో యోషిడా (జపాన్‌‌) చేతిలో, 62 కేజీల ఫైనల్లో సవిత టెక్నికల్ సుపిరియారిటీ (2–12)తో సకురా ఒనిషి (జపాన్‌‌) చేతిలో ఓడి రజత పతకాలతో సరిపెట్టుకున్నారు.

విమెన్స్‌‌ 68 కేజీల్లో మాన్సి లాథర్‌‌ ఫైనల్‌‌కు చేరుకోగా, 59 కేజీల రెప్‌‌చేజ్‌‌ రౌండ్‌‌లో కోమల్‌‌.. రోసా మోలినా రొడ్రిగ్వేజ్‌‌ (స్పెయిన్‌‌)తో తలపడనున్నారు.