
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ స్టేట్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తన్మయ్ ఓంకార్ రాయ్, ధవళికా దేవి మూడు గోల్డ్ మెడల్స్ హ్యాట్రిక్ సాధించారు. గచ్చిబౌలిలో 9 రోజుల పాటు జరిగిన ఈ మెగా ఈవెంట్‌లో తన్మయ్ మెన్స్10 మీటర్ల రైఫిల్ ఈవెంట్లలో చాంపియన్‌గా నిలిచాడు.
జూనియర్, సబ్ జూనియర్, యూత్ కేటగిరీ ఫైనల్స్‌లో 393/400 స్కోర్లతో అతను టాప్ ప్లేస్‌లు సొంతం చేసుకున్నాడు. మరోవైపు ధవళికా విమెన్స్ సెక్షన్‌లో పోటీ పడ్డ మూడు కేటగిరీల్లోనూ చాంపియన్‌గా నిలిచింది.10 మీటర్ల రైఫిల్ జూనియర్ విమెన్, యూత్ విభాగాల్లో భూమారపు అక్షిత రెండో గోల్డ్ మెడల్స్ సొంతం చేసుకుంది. తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమిత్ సంఘి, ఎంపీ కందూరు రఘువీర్ రెడ్డితో కలిసి విన్నర్లకు మెడల్స్ అందజేశారు.