- సుజిత్ స్వర్ణ పట్టు, ఆర్చరీలో విమెన్స్కు కూడా..
- ఫ్లాగ్ బేరర్‌గా నీరూ దండా
నిషియో: ఆసియా క్రీడల్లో ఇండియా బాక్సర్ల పంచ్ అదిరింది. స్టార్ బాక్సర్లు లవ్లీనా బోర్గోహైన్, పర్వీన్ హుడా, అంకుష్ పంగల్ స్వర్ణాలతో హ్యాట్రిక్ సాధించారు. శుక్రవారం జరిగిన విమెన్స్ 75 కేజీల ఫైనల్లో లవ్లీనా 5–0తో జియి బావో (చైనా)పై ఏకపక్షంగా గెలవగా, 65 కేజీల టైటిల్ బౌట్‌లో పర్వీన్ 3–2తో చెన్ నీన్‌చిన్ (చైనీస్‌తైపీ)ని ఓడించింది. దాంతో 12 ఏళ్ల తర్వాత ఇండియా విమెన్ బాక్సర్లు గోల్డ్ నెగ్గి లెజెండ్ బాక్సర్ ఎంసీ మేరీకోమ్ సరసన నిలిచారు. 2014 ఇంచియాన్ క్రీడల్లో మేరీ (51 కేజీ) గోల్డ్ గెలిచింది.
ఇక పర్వీన్‌కు ఏషియాడ్‌లో ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. 29వ పుట్టిన రోజునాడు లవ్లీనా రింగ్‌లో ప్రత్యర్థిపై బలమైన పంచ్‌లతో చెలరేగింది. తన ఎత్తును పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ 20 ఏళ్ల బావోపై పిడి గుద్దులు కురిపించింది. దాంతో తొలి రౌండ్‌ను 3–2తో ముగించింది. రెండో రౌండ్‌లో బావో లెఫ్ట్ హుక్ కాంబినేషన్‌తో పంచ్‌లు కొట్టగా లవ్లీనా తెలివిగా తప్పించుకుంది. చివరి రౌండ్‌లో లవ్లీనా దూరం నుంచి కొట్టిన పంచ్‌లు బావోకు నేరుగా తగలడంతో జడ్జీలు ఏకపక్షంగా 4–1 స్కోరు ఇచ్చారు.
చెన్‌తో జరిగిన బౌట్‌లోనూ పర్వీన్ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అయితే చైనీస్‌తైపీ బాక్సర్ కూడా దీటుగా పంచ్‌లు వేయడంతో బౌట్ హోరాహోరీగా సాగింది. అయినప్పటికీ చివరి రౌండ్‌లో పర్వీన్ బలమైన రైట్ హుక్స్‌తో ప్రత్యర్థిని కట్టడిచేసి చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. మెన్స్ 80 కేజీల ఫైనల్లో అంకుష్ 4–0తో కిమ్ మిన్‌సోంగ్ (సౌత్ కొరియా)పై గెలిచి గోల్డ్‌ను సొంతం చేసుకున్నాడు. దాంతో ఈ ఏడాది కామన్వెల్త్ స్వర్ణానికి ఏషియాడ్ బంగారు పతకాన్ని జోడించాడు. బౌట్ ఆద్యంతం కిమ్‌పై పూర్తి ఆత్మవిశ్వాసంతో పంచ్‌లు విసిరిన అంకుష్ ఎక్కడా
తడబడలేదు
