7 నెలల్లోనే 11 వేలు తగ్గిన బంగారం ధర

7 నెలల్లోనే 11 వేలు తగ్గిన బంగారం ధర
  • గోల్డ్​ రేటు తగ్గుతోంది
  • 7 నెలల్లోనే 11 వేలు పడింది
  • కొనడానికి ఇదే మంచి ఛాన్స్ అంటున్న బులియన్ వర్గాలు
  • ధరలు తగ్గడానికి గ్లోబల్‌‌ అంశాలే కారణం
  • లోకల్‌‌గా తగ్గిన కొనుగోళ్లు

బంగారం రేట్లు క్రమంగా దిగొస్తున్నాయి. కిందటేడాది అగస్టులో రూ.58 వేల వద్ద ఆల్‌‌టైమ్‌‌ హైని తాకిన తులం బంగారం ధర ప్రస్తుతం రూ.46,800కు దిగింది. అంటే ఏడు నెలల్లోనే రూ. 11 వేలు పడిపోయింది. బంగారం కొనేందుకు ఇదే మంచి చాన్సని, పెళ్లిళ్ల సీజన్ స్టార్టయితే ధరలు మళ్లీ పెరగొచ్చని మార్కెట్​ వర్గాలు చెబుతున్నాయి.  బంగారంపై ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ చేసేవాళ్లు కూడా షేర్ మార్కెట్‌‌ వైపు వెళుతుండడంతో వీటి ధరలు పడిపోతున్నాయి. మరోవైపు వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి.  ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.71 వేల రేంజ్‌‌లో ఉంది.

గోల్డ్‌‌ కొనడానికి ఇదే గోల్డెన్​​టైమ్​ ఏమో.  గ్లోబల్‌‌ కారణాలతోపాటు తాజా బడ్జెట్లో డ్యూటీ తగ్గించడంతో  గత కొంత కాలంగా  పసిడి ధర నేల చూపులు చూస్తోంది. ఆగస్ట్‌‌ 2020 ధరతో పోలిస్తే 10 గ్రాముల బంగారం ప్రస్తుతం రూ. 11 వేలు తక్కువకే దొరుకుతోంది. పెళ్లిళ్ల సీజన్ స్టార్టయితే గోల్డ్‌‌ ధరలు మళ్లీ పుంజుకోవచ్చని బులియన్ వర్గాలు చెబుతున్నాయి..

బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌‌‌, వెలుగు: కిందటేడాది రాకెట్‌లా దూసుకుపోయిన గోల్డ్‌ ధరలు, కొత్త సంవత్సరంలో నేల చూపులు చూస్తున్నాయి.  ఆగస్ట్‌‌‌‌, 2020లో రూ. 58,000 వద్ద(స్పాట్‌‌‌‌ మార్కెట్‌‌‌‌) ఆల్‌‌‌‌టైమ్‌‌‌‌ హైని తాకిన 10 గ్రాముల బంగారం, ప్రస్తుతం రూ. 46,800 స్థాయికి పడిపోయింది. గత ఏడు నెలల్లోనే రూ. 11 వేలు తగ్గింది. పెళ్లిళ్ల సీజన్‌‌‌‌  కూడా ఇంకా స్టార్ట్‌‌‌‌ కాకపోవడంతో గోల్డ్‌‌‌‌కు డిమాండ్‌‌‌‌ బాగా తగ్గింది. బంగారాన్ని  ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌గా చూసేవారు కూడా షేర్ మార్కెట్‌‌‌‌ వైపు వెళుతుండడంతో వీటి ధరలు పడుతున్నాయి. గోల్డ్ ధరల పతనం ఈ ఏడాది బడ్జెట్‌‌‌‌ నుంచి ప్రారంభమయ్యిందనే చెప్పాలి. బంగారం, వెండి వంటి విలువైన లోహాలపై కస్టమ్స్‌‌‌‌ డ్యూటీని ప్రభుత్వం 12.5 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించింది. దీంతో వీటి ధరలు తగ్గుతున్నాయి. వెండి ధరలు కూడా పడుతున్నాయి. కానీ బంగారం అంత వేగంగా వీటి ధరలు తగ్గడం లేదు. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 71 వేల రేంజ్‌‌‌‌లో ఉంది. ఇండస్ట్రియల్‌‌‌‌గా కూడా సిల్వర్ వాడుతుంటారు కాబట్టి వీటి ధరలు గోల్డ్‌‌‌‌తో పోల్చుకుంటే నెమ్మదిగా తగ్గుతున్నాయి. కాగా, గోల్డ్‌ ధర తగ్గడానికి ముఖ్య కారణం గ్లోబల్‌ అంశాలే. వీటికి తోడు ఇండియాలో డిమాండ్‌ కూడా పడిపోతుండడంతో బంగారం ధరలు తగ్గుతున్నాయి.

ఎంత వరకు గోల్డ్ పడొచ్చు..

పది గ్రాముల గోల్డ్‌‌‌‌ ధర స్పాట్‌‌‌‌ మార్కెట్లో రూ. 45 వేల వరకు పడొచ్చని బులియన్ మార్కెట్‌‌‌‌ వర్గాలు చెబుతున్నాయి. కరోనా టైమ్‌‌‌‌లో గ్లోబల్‌‌‌‌ ఎకానమీ బాగలేకపోవడంతో గోల్డ్ ధరలు పెరిగాయని పేర్కొన్నాయి. ఇప్పుడు గ్లోబల్‌‌‌‌ ఎకానమీ మెరుగుపడుతుండడంతో  బంగారం ధరలు పడుతున్నాయని తెలిపాయి. అంతేకాకుండా దేశంలో వ్యాక్సినేషన్ ప్రాసెస్‌‌‌‌ స్టార్టవ్వడంతో కూడా గోల్డ్‌‌‌‌ ధరలు పడుతున్నాయని పేర్కొన్నాయి. ప్రస్తుతం స్పాట్‌‌‌‌ మార్కెట్లో 10 గ్రాముల గోల్డ్‌‌‌‌ ధర 22 క్యారెట్లయితే  రూ. 45,920 కి, 24 క్యారెట్లయితే  రూ. 46,860 కు అందుబాటులో ఉంది. 18 క్యారెట్లయితే  రూ. 36,080 కే దొరుకుతోంది. వీటిపై అదనంగా జీఎస్‌‌‌‌టీ ఉంటుంది. రేట్లు పడుతున్నా, బయ్యర్లు లేరని బులియన్ మార్కెట్‌‌‌‌ వర్గాలు చెబుతుండడం విశేషం.

గోల్డ్‌‌ పడడానికి గ్లోబల్‌ కారణాలు..

రికవరీ బాటలో దేశాల ఎకానమీలు..

వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు రెసిషన్‌‌‌‌లోకి వెళ్లడంతో 2020 లో గోల్డ్‌‌‌‌ ధరలు విపరీతంగా పెరిగాయి. ఆల్‌‌‌‌టైమ్‌‌‌‌ హైలను కూడా టచ్ చేశాయి. కానీ ప్రస్తుతం ఈ పరిస్థితులు మారాయి. కరోనా వ్యాక్సిన్‌‌‌‌ కూడా అందుబాటులోకి రావడంతో షేర్లు వంటి రిస్క్ ఉన్న అసెట్లలో డబ్బులు పెట్టడానికి ఇన్వెస్టర్లు చూస్తున్నారు. గోల్డ్ వంటి సేఫ్‌‌‌‌ మెటల్స్‌‌‌‌కు దూరంగా ఉంటున్నారు. దీంతో గోల్డ్ ధరలు తగ్గుతున్నాయి.

డాలర్ పైకి ..

సాధారణంగా దేశాల మధ్య గోల్డ్‌‌‌‌ లావాదేవీలు యూఎస్‌‌‌‌ డాలర్‌‌‌‌లోనే జరుగుతాయి. గత  నెల రోజుల నుంచి గ్లోబల్‌‌‌‌గా ఉన్న ఆరు మేజర్‌‌‌‌‌‌‌‌ కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలపడుతోంది. డాలర్‌‌‌‌‌‌‌‌ ఇండెక్స్‌‌‌‌ 91.15 స్థాయికి చేరుకుంది. ఫిబ్రవరి తర్వాతే ఇదే హయ్యస్ట్‌‌‌‌ లెవెల్‌‌‌‌. కాగా, డాలర్ బలపడితే ఇతర దేశాల కరెన్సీలో గోల్డ్‌‌‌‌  ఖరీదవుతుంది.  దీంతో బయ్యర్లు కొనడానికి వెనకడుగేస్తారు. ఇది గోల్డ్ డిమాండ్‌ తగ్గడానికి కారణమవుతోంది.

బాండ్‌‌‌‌ ఈల్డ్‌‌‌‌లు పెరుగుతున్నాయి..

గోల్డ్‌‌‌‌ ధరలు తగ్గడానికి పెరుగుతున్న బాండ్‌‌‌‌ ఈల్డ్‌‌‌‌లు కూడా కారణమే. యూస్‌‌‌‌ బాండ్‌‌‌‌ ఈల్డ్‌‌‌‌లు పెరుగుతుండడంతో గ్లోబల్​గా గోల్డ్‌‌‌‌లోని ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లు బాండ్స్​  వైపు వెళుతున్నాయి. దీంతో డిమాండ్​ తగ్గి… గోల్డ్‌‌‌‌ ధరలు పడుతున్నాయి.

సెంట్రల్‌‌‌‌ బ్యాంకుల నుంచి తగ్గిన డిమాండ్‌‌‌‌..

ఆర్థిక వ్యవస్థులు రికవరీ అవుతుండడంతో మన రిజర్వ్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌తో సహా వివిధ దేశాల సెంట్రల్‌‌‌‌ బ్యాంకుల  గోల్డ్‌‌‌‌ కొనుగోళ్లు తగ్గించేశాయి.. ఇది కూడా గోల్డ్‌‌‌‌ డిమాండ్ పడిపోవడానికి కారణమవుతోంది.

పెళ్లిళ్ల సీజన్‌‌‌‌..

మన దేశంలోనైతే ముహుర్తాలు లేకపోవడంతో ఇంకా పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్‌‌‌‌ కాలేదు. దీని వలన కూడా జ్యుయెలరీ కొనుగోళ్లు పెద్దగా జరగడం లేదు. దీంతో గోల్డ్ డిమాండ్ పడిపోతోంది.

గ్లోబల్‌‌‌‌ ఎకానమీలు రికవరీ అవుతుండడంతో గోల్డ్‌‌‌‌ ధరలు తగ్గుతున్నాయి. 10 గ్రాముల గోల్డ్‌‌‌‌ రూ. 45 వేల వరకు పడొచ్చు. అక్కడి నుంచి మళ్లీ పెరుగుతుంది. గోల్డ్ ధరలు తగ్గుతున్నా,  ఎవరూ కొనడానికి రావడం లేదు. వెండి ధర(కేజి) మాత్రం  రూ. 70 వేల రేంజ్‌‌‌‌లోనే ఉంది. వెండి రేట్లలో కదలికలెక్కువగా ఉంటాయి కాబట్టి. ఒకే సారి రూ. 5 వేలు కూడా పెరగొచ్చు లేదా  పడొచ్చు.

-ప్రవీణ్ కుమార్‌‌‌‌, ట్విన్‌‌‌‌ సిటీ జ్యుయెల్లరీ అసోసియేషన్ సెక్రటరీ‌‌‌‌