Gold rate : 24 గంటల్లో15వందలు పెరిగిన బంగారం ధర

Gold rate : 24 గంటల్లో15వందలు పెరిగిన బంగారం ధర

దేశంలో పసిడి ధరకు రెక్కలొచ్చాయి. గడిచిన కొంతకాలంగా బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రెండరోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు గత 24 గంటల్లో భారీగా పెరిగాయి. దీంతో మార్చి 21న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.59,780కి చేరుకుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం  రూ. 54,800గా నిలిచింది. 

సోమవారం (మార్చి 20) నాడు 24 క్యారెట్ గోల్డ్ రూ.58,220 ఉండగా ఒక్కరోజులోనే 15 వందల రూపాయలు పెరిగింది. నిన్న 22 క్యారెట్ గోల్డ్ కు రూ. 53,330 ఉండగా ఇవాళ రూ.54,800 వద్ద నిలిచింది.