వరుసగా ఆరో రోజు తగ్గిన బంగారం ధరలు

వరుసగా ఆరో రోజు తగ్గిన బంగారం ధరలు

బంగారం ధర ఆకాశాన్నంటడంతో దానికి రెక్కలొచ్చాయి. దాంతో మధ్యతరగతి, పేదవారికి అందనంత ఎత్తుకు చేరింది. ఈ తరుణంలో గత ఆరు రోజులుగా బంగారం ధర కాస్త తగ్గింది. దాంతో గురువారం ఏప్రిల్ 29న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 48,560కు చేరింది. అదేవిధంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 44,300కు చేరింది. కాగా.. వెండి ధర మాత్రం పైపైకి పోతోంది. కేజీ వెండి ధర రూ. 74,300గా ఉంది.