Gold Rate: ఈవారం రూ.3వేల 770 పెరిగిన తులం బంగారం.. రికార్డ్ గరిష్ఠాలను తాకిన రేట్లు..

Gold Rate: ఈవారం రూ.3వేల 770 పెరిగిన తులం బంగారం.. రికార్డ్ గరిష్ఠాలను తాకిన రేట్లు..

Gold Price Today: దాదాపు గడచిన 10 రోజుల నుంచి రిటైల్ మార్కెట్లలో బంగారం క్రమంగా భారీ పెరుగుదలను చూస్తూనే ఉంది. పైగా అక్టోబర్ స్టార్టింగ్ నుంచి అంతర్జాతీయంగా దిగజారుతున్న ఆర్థిక, రాజకీయ పరిస్థితుల మధ్య బంగారానికి భారీగా గిరాకీ పెరిగింది. సోమవారం నుంచి ఈరోజు అంటే అక్టోబర్ 8 వరకు బంగారం రేట్లు 24 క్యారెట్లకు తులం రూ.3వేల 770 పెరగటం సంచలనంగా మారింది. ఇలా అయితే సామాన్య మధ్యతరగతి గోల్డ్ కొనటం కలేనని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షాపింగ్ చేయాలనుకున్న వారు ముందు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో రిటైల్ రేట్లను ఖచ్చితంగా పరిశీలించండి.. 

24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే అక్టోబర్ 7తో పోల్చితే 10 గ్రాములకు అక్టోబర్ 8న రూ.1150 పెరిగింది. అంటే గ్రాముకు రేటు రూ.115 పెరగటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో రిటైల్ విక్రయ రేట్లు ఇలా ఉన్నాయి..

24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(అక్టోబర్ 8న):

  • హైదరాదాబాదులో రూ.12వేల 317
  • కరీంనగర్ లో రూ.12వేల 317
  • ఖమ్మంలో రూ.12వేల 317
  • నిజామాబాద్ లో రూ.12వేల 317
  • విజయవాడలో రూ.12వేల 317
  • కడపలో రూ.12వేల 317
  • విశాఖలో రూ.12వేల 317
  • నెల్లూరు రూ.12వేల 317
  • తిరుపతిలో రూ.12వేల 317

ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు అక్టోబర్ 7తో పోల్చితే ఇవాళ అంటే అక్టోబర్ 8న 10 గ్రాములకు రూ.1050 పెరుగుదలను చూసింది. దీంతో బుధవారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. 

22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(అక్టోబర్ 8న):

  • హైదరాదాబాదులో రూ.11వేల 290
  • కరీంనగర్ లో రూ.11వేల 290
  • ఖమ్మంలో రూ.11వేల 290
  • నిజామాబాద్ లో రూ.11వేల 290
  • విజయవాడలో రూ.11వేల 290
  • కడపలో రూ.11వేల 290
  • విశాఖలో రూ.11వేల 290
  • నెల్లూరు రూ.11వేల 290
  • తిరుపతిలో రూ.11వేల 290

మరోపక్క అక్టోబర్ 8న కేజీకి వెండి అక్టోబర్ 7తో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు స్థిరంగా కేజీ రూ.లక్ష 67వేల వద్ద కొనసాగుతోంది. అంటే గ్రాము వెండి రేటు రూ.167 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.