‘నీ క్యాప్స్’లో కిలో బంగారంతో దొరికిపోయాడు

‘నీ క్యాప్స్’లో కిలో  బంగారంతో దొరికిపోయాడు

అరబ్బు దేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా ఇండియాలోకి తీసుకొచ్చేందుకు కొత్త కొత్త మార్గాలను అనుసరిస్తున్నారు. తల విగ్గు, జెడ, షూస్, అండర్ వేర్ ఇలా ఎన్నో చోట్ల బంగారాన్ని దాచి తీసుకొచ్చిన ఘటనలు గతంలో వెలుగుచూశాయి. అలాంటి వాళ్లను హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు పట్టుకున్న వైనాలను మనం చూశాం. తాజాగా మరో కొత్త రకం పద్ధతిలో బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తిని హైదరాబాద్ కస్టమ్స్ విభాగం పట్టుకుంది. ఎవరికీ అనుమానం రాకూడదనే ఉద్దేశంతో .. మోకాలి నొప్పులు తగ్గడానికి వినియోగించే ‘నీ క్యాప్స్’లో  కిలో బంగారాన్ని తరలించేందుకు ఓ వ్యక్తి యత్నించాడు. అతడు హైదరాబాద్ విమానాశ్రయంలో దిగగానే కస్టమ్స్ టీమ్ అదుపులోకి తీసుకుంది. ఆ వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం విలువు రూ.53.77 లక్షలు ఉంటుందని వెల్లడించారు.