జెలెన్ స్కీ ఇంటి ముందే నాటు నాటు షూటింగ్

జెలెన్ స్కీ ఇంటి ముందే నాటు నాటు షూటింగ్

ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా మరోసారి రికార్డు సృష్టించింది. ఈ సినిమాలోని ఒక్క పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకుంది. ఫుల్ మాస్ ఎంటర్ టైనింగ్ బీట్‭గా సాగిన నాటు నాటు పాట ప్రపంచవ్యాప్తంగా ఉర్రూతలూగించింది. నాటు నాటు అంటూ వేసిన స్టెప్పు ఇప్పుడు మారుమోగుతోంది. అయితే.. ఈ సాంగ్ షూటింగ్ ఉక్రెయిన్‭ రాజధాని కీవ్‭లో జరిగింది. రష్యా, ఉక్రెయిన్ వార్ జరగడానికి ముందే ఈ సాంగ్ షూటింగ్ అక్కడ జరిగింది. స్టోరీకి బ్రిటీష్ టచ్ ఉన్న కారణంగా.. పాట కోసం అందమైన బిల్డింగ్‭ను ఎంచుకున్నారు. 

ఉక్రెయిన్ ప్రస్తుత అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్యాలెస్ ముందు ఈ బిల్డింగ్ ఉంది. కథా నేపథ్యానికి తగినట్లు బ్యాక్ గ్రౌండ్ ఫిక్స్ చేశారు. బ్లూ కలర్ బిల్డింగ్.. బార్బి క్యూ ఆర్కిటెక్చర్ సాంగ్‭లో ఆకట్టుకుంది. తాజాగా.. జూనియర్ ఎన్టీఆర్ ఉక్రెయిన్ షెడ్యూల్‭కి సంబంధించిన ఓ పిక్‭ను షేర్ చేశారు. ఆ ఫోటోలో ఎన్టీఆర్‭తో పాటు రాజమౌళి కూడా కనిపించారు. ఇద్దరూ తమ ఐడీ కార్డులు చూపిస్తున్నారు. దీనికి ఎన్టీఆర్.. తాను ఐడీ కార్డు ధరించి చాలా రోజులైంది అంటూ ఓ కాప్షన్ కూడా పెట్టారు. ఇక చాలా మందికి ఈ సాంగ్ షూటింగ్ ఉక్రెయిన్‭లో జరిగిందన్న విషయం తెలియదు. ఇప్పుడు దీని గురించి తెలుసుకోవడానికి గూగుల్‭లో తెగ సెర్చ్ చేసేస్తున్నారు.