108 అంబులెన్స్ ‌‌లు ప్రారంభం: గొంగిడి సునీత

108 అంబులెన్స్ ‌‌లు ప్రారంభం: గొంగిడి సునీత

యాదగిరిగుట్ట, వెలుగు: మారుమూల గ్రామాల ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించడమే లక్ష్యమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గొంగిడి సునీత చెప్పారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి, బొమ్మలరామారం, ఆలేరు మండలాలకు కొత్తగా మంజూరైన మూడు 108 అంబులెన్సులు,  102 అంబులెన్స్ వాహనాన్ని బుధవారం యాదగిరిగుట్టలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆలేరు నియోజకవర్గంలో రూ.6.80 కోట్లతో  34 హెల్త్ ‌‌ సెంటర్లను నిర్మించడంతో పాటు ప్రతి పీహెచ్సీ, సబ్ సెంటర్‌‌కు ఒక స్టాఫ్ నర్స్ ను నియమించిందని తెలిపారు.

ALSO READ:బీఆర్ఎస్ పార్టీకి సాయన్న లేని లోటు పూడ్చలేనిది : కేసీఆర్

 గర్భిణులు ప్రసవం అయ్యే వరకు ఎలాంటి ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో 102 అంబులెన్స్‌‌‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ ‌‌వో సాంబశివరావు, తుర్కపల్లి ఎంపీపీ భూక్యా సుశీల రవీందర్ నాయక్, ఎంపీటీసీలు పలుగుల నవీన్ కుమార్, గిద్దె కరుణాకర్, మండల వైద్యాధికారి డాక్టర్ వంశీకృష్ణ, ఆలేరు ఎంపీపీ శంకరయ్య, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కాంటేకార్ పవన్ పాల్గొన్నారు.