Good Health : నీళ్లలో ఎక్సర్ సైజ్.. మస్త్ ఫిట్ నెస్

Good Health : నీళ్లలో ఎక్సర్ సైజ్.. మస్త్ ఫిట్ నెస్

ఆక్వా ఏరోబిక్స్.. ఎంజాయ్ చేస్తూ ఫిట్నెస్ పెంచుకునే బెస్ట్ ఛాయిస్. హ్యాపీగా నడుము లోతు నీళ్లలో నిలుచుని స్లోగా ఏరోబిక్ ఎక్సర్ సైజ్ చేయడమే ఆక్వా ఏరోబిక్స్. వీటి కోసం ప్రత్యేకంగా క్లాసులు కూడా ఉన్నాయి. లైట్ మ్యూజిక్ పెట్టుకుని గ్రూప్ చేసుకునే ఆక్వా ఏరోబిక్సికి ఇటీవల క్రేజ్ పెరుగుతోంది.

అక్వా ఏరోబిక్స్ ను వాటర్ ఏరోబిక్స్ అని కూడా అంటారు. ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేస్తూ స్విమింగ్ పూల్లో ప్రాక్టీస్ చెయ్యొచ్చు. అయితే అంతకు ముందుగా వాటర్ ఏరోబిక్స్ క్లాసెస్ అటెండ్ అయితే బాగుంటుంది. అందులోని టెక్నిక్స్, ప్రికాషన్స్ తప్పనిసరిగా తెలుసుకోవాలి. 

లాభాలేంటి?

 • ఏరోబిక్స్ అంటే లైట్ ఎక్సర్సైజ్. వామప్కా నెక్స్ట్ లెవెల్. వాటర్ బాడీకి బాగా సపోర్ట్ ఇస్తుంది. నీళ్లలో ఎక్సర్సైజ్ ఫిట్నెస్ నీళ్లలో ఉన్నప్పుడు గ్రావిటీ, ఫ్రిక్షన్ తక్కువగా ఉంటాయి. అందువల్ల ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బోన్ జాయింట్స్ దగ్గర ఒత్తిడి తగ్గుతుంది
. • నీటిలో ఎక్సర్ సైజ్ చేసేటప్పుడు కండరాలు మరింత స్ట్రాంగ్ అవుతాయి. నీటిని ముందుకీ, వెనక్కీ నెట్టడం వల్ల భుజాల్లో పవర్ పెరుగుతుంది. నడుము, తొడ, భుజాల్లో కండరాలు గట్టిపడతాయి. 
• ఆక్వా ఏరోబిక్స్ హార్ట్ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాడీ మొత్తం ఒకేలా ఉండటానికి నీటిలో చేసే ఈ వ్యాయామం చాలా మంచిది. 
• బయట చేసే ఎక్సర్సైజ్ కన్నావాటర్లో కొంచెం ఎక్కువ సేపు చెయ్యొచ్చు. అలసట తక్కువగా ఉంటుంది. ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. 
• సరైన బాడీ మాస్ ఇండెక్స్ మెయిన్టెయిన్ చేయడానికి ఇలాంటి ఎక్సర్సైజులు మంచివి. లంగ్స్ కెపాసిటీ కూడా పెంచుకోవచ్చు. మజిల్ స్ట్రెంత్, బాడీ ఫ్లెక్సిబిలిటీ పెంచడానికి ఏరోబిక్ థెరపీని ప్రిఫర్ చేస్తున్నారు. 
• ఆక్వా ఏరోబిక్స్ పాటు ఆక్వా సైక్లింగ్, ఆక్వా జాగింగ్, ఆక్వా పోలో వంటివి చేస్తుంటే ఎంకరేజింగ్ గా ఉంటాయి. 
• ఆక్వా ఏరోబిక్ లొకేషన్ మూడ్ వల్ల స్ట్రెస్, యాంగ్జయిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. క్యాలరీలు కరిగి, బాడీ ఫ్యాట్ బాగా తగ్గుతుంది.