చలి కాలం జబ్బులకు చెక్‌ పెట్టండిలా

చలి కాలం జబ్బులకు చెక్‌ పెట్టండిలా

 చలికాలంలో జలుబు, దగ్గు వంటివి సాధారణం. వాతావరణంలో మార్పులు, చల్లటి గాలులు, సూర్యరశ్మి తక్కువగా ఉండడమే అందుకు కారణం. ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే ఈ చిన్న చిన్న అనారోగ్యాల బారిన పడకుండా రక్షణ పొందొచ్చు.

అవేంటో చూద్దాం..
పసుపు: రాత్రి పూట నిద్రపోయే ముందు పాలలో, కొద్దిగా పసుపు కలుపుకొని తాగాలి. జలుబు, దగ్గు, తలనొప్పి వంటి సమస్యలు తగ్గిపోవడమే కాకుండా రోగనిరోధక శక్తి కూడా మెరుగవుతుంది.

చిలగడదుంప: వీటిలో విటమిన్‌‌‌‌‌‌‌‌ ఎ, పీచు పదార్థం, పొటాషియం అధికంగా ఉంటుంది. చిలగడదుంప తింటే కడుపు ఉబ్బరం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.

అల్లం: తేనె కలిపిన అల్లం ముక్కలను గానీ, అల్లం రసం గానీ రోజు తీసుకుంటే దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గిపోతాయి. జీర్ణశక్తి కూడా మెరుగవుతుంది.

డ్రైఫ్రూట్స్‌‌‌‌: బాదం పప్పు, జీడిపప్పు, అంజీర, వాల్‌ నట్స్, ఎండుద్రాక్ష, ఖర్జూరాలను పరిమితంగా అయినా తీసుకోవాలి. శరీరానికి పోషకాలు,  చర్మానికి అవసరమైన నూనెలు వీటిలో పుష్కలంగా ఉంటాయి.

నువ్వులు: శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో నువ్వులు కూడా బాగానే పనిచేస్తాయి. రెండు రోజులకు ఒకసారి నువ్వుల నూనెతో శరీరాన్ని బాగా మర్దన చేసుకుని వేడి నీటితో స్నానం చేయాలి. దీంతో శరీరంలో వేడి పెరుగుతుంది. చలి నుంచి రక్షణ లభిస్తుంది.