Good Health : నీరసం రాకుండా.. బరువు తగ్గించే డైట్ ఫుడ్ ఇదే

Good Health : నీరసం రాకుండా.. బరువు తగ్గించే డైట్ ఫుడ్ ఇదే

బరువు తగ్గడం, ఫిట్ మారడం... గోల్ ఏదైతేనేం? డైటింగ్ చేస్తే చాలు అనుకుంటారు. చాలామంది. డైటింగ్లో చాలా రకాలున్నాయి. దాంతో వాటిలో ఏది పాటించాలనే కన్ఫ్యూజన్ ఉంటుంది చాలామందికి. అయితే... కొందరు సోషల్ మీడియాలో చూసి లేదా ఇన్ఫ్లుయెన్సర్ల మాటలు డైటింగ్ మొదలుపెడతారు. అవి తమ బాడీకి ఆరోగ్యానికి సరిపోతాయా? లేదా? అనేది ఆలోచించరు. ఇలా చేయడంవల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అంతేకాదు ఆరోగ్యం దెబ్బతినకుండా బరువు తగ్గడానికి ఎంచుకోవాలి. డైటింగ్ చేసి ముందు లేదా డైటీషియన్ న్యూట్రిషనిస్ట్ ని లేదా డైటీషియన్ ని కలవాలి అంటోంది న్యూట్రిషనిస్ట్ సుజాత స్టీఫెన్.

జంక్ ఫుడ్, నూనె, కొవ్వు ఎక్కువ ఉండే ఫుడ్ తినడంతో పాటు వింటే. ఈటింగ్ ఆకలి వేయకున్నా ఏదో ఒకటి తినడం) వల్ల బరువు పెరుగుతారు చాలామంది. దాంతో తక్కువ టైంలో బరువు తగ్గాలని జిన్లో చేరతారు. అయినా రిజల్ట్ కనిపించకపోవడంతో డైటింగ్ మొదలుపెడతారు.ఇలాంటి వాళ్లలో ఆన్లైన్లో చూసి లేదా సెలబ్రిటీలు ఫాలో అయ్యే డైట్ లు అని కొన్ని డైట్ ప్లాన్స్ చేస్తుంటారు కొందరు.

ప్లానింగ్ ఉంటేనే...

ఈమధ్య ఇంటర్నెట్లో, ప్రపంచవ్యాప్తంగా కొన్ని రకాల డైట్స్ టెండ్ అవుతున్నాయి. వాటిలో మెడిటెర్రేనియన్, బ్లూ జోన్ డైట్, ఇంటర్నిటెంట్ ఫాస్టింగ్ వంటివి ముఖ్యమైనవి. అయితే, ఏ వైల్ పాటించే ముందు అయినా... ఆడైట్ ఎంతవరకు సరిపోతుంది? ఎక్కువ రోజులు పాటించగలరా లేదా? అనేది ఆలోచించుకోవాలి. అంతేకాదు ఆ డైట్ కి తగ్గట్టుగా టైం టేబుల్ సుకోవాలి. అలానే అయినా ఎక్కువరోజులు పాటిస్తేనే బరువు తగ్గుతారు అలాకాకుండా రెండు మూడు వారాలకు ఏ ఆపేస్తే బరువు ఉంది. బరువు పెరిగినవాళ్లకు డైటింగ్ బాగా ఉపయోగపడుతుంది. అన్ని డైట్ ప్లాన్స్ లో రిజల్ట్ కనిపిస్తుంది. అయితే, ఇక్కడ కోవాల్సింది. ఎంటంటే... అందరికీ ప్లాన్ సెట్ కాదు. అందుకని ఆరోగ్యం బరువు తగ్గడానికి ఉపయోగపడే డైట్స్ ఫాలో కావాలి. వీటి వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యల నుంచి బయట పడొచ్చు.

ఇవి ముఖ్యమైనవి

కీటో డైట్ - ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువ.. ప్రొటీన్మతాడుగా, ప్యాట్ ఎక్కువ ఉన్న ఫుడ్ తినాలి. నల్స్, గింజలు, అవకాడో, వెన్న, జున్ను, గుడ్లు, ఫ్యాట్ ఉండే చేపలు, చికెన్ వంటివి ఈ రైట్ భాగం. ఈ డైట్ పాటించేవాళ్ల శరీరం. కార్బోహైడ్రేట్స్ బయలు ఫ్యాట్స్ ని ఎనర్జీగా వాడుకుంటుంది. దీన్ని కీటోసిస్' అంటారు. ఈ డైట్ వల్ల బరువు తగ్గడమే కాకుండా షుగర్, ఇన్సులిన్ లెవల్స్ తగ్గుతాయి.

లో కార్ప్స్ డైట్ - అన్నం, బైడ్, ఆలుగడ్డలు. బీన్స్, పాప్కార్న్ వంటి వాటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి ఎక్కువ తింటే తొందరగా బరువు పెరుగుతారు. అందుకనిలో -కార్ప్ డైట్ లో వీటి బదులు ప్రొటీన్, ఫ్యాట్ ఉండే చేపలు. ? గుడ్లు, గూటెన్ ఉండని ని పదార్థాలు, కూరగాయలు, పండ్లు, నట్స్ వంటివి తినాలి. అయితే డయాబెటిస్ ఉన్నవాళ్లు ఎక్కువ రోజులు ఈ డైట్ పాటించలేదు. ఎందుకంటే ఈ డైట్ ఫాలో అయితే షుగర్ కంట్రోల్లో ఉండడం అటుంచి షుగర్ లెవల్స్. . పూర్తిగా పడిపోయే అవకాశం ఉంది.

మెడిటెర్రీనియన్ డైట్ - ఈ మధ్య పాపులర్ ఇదొకటి, మధ్యధరా సముద్రం సవాహ ప్రాంతం గ్రీస్, ఇటలీ)లో ఉండేవాళ్లు ఈ డైట్ చేస్తారు. వీళ్లు ఆకుకూరలు, కూరగాయలతో పాటు చేపలు, చికెన్, గుడ్లు, చీజ్ వంటివి తింటారు అయితే, ఈ డైట్ అందరికీ సెట్ కాదు.

ప్లాంట్ బేస్డ్ రైట్ - పూర్తిగా కూరగాయలు, పండ్లు, నట్స్, చిక్కుడు జాతి కూరలు మాత్రమే తింటారు. దీన్ని 'వీగన్ డైట్" అంటారు. ఈ డైట్ పాటించేవాళ్లకు హెల్దీ ఫ్యాట్స్అందుతాయి. కానీ, విటమిన్-బి12, విటమిన్-డి వంటి ముఖ్యమైన పోషకాలు అందవు. అందుకని డైట్లో ప్రొటీన్ ఉండేలా చూసుకోవడం తప్పనిసరి.

* ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ - వీళ్ల డైట్లో అవకాడో, చేపలు, క్యాబేజీ, ప్రొ-బయాటిక్స్, బీన్స్, గుడ్లు, నట్స్ వంటివి ఉంటాయి. ఇందులో 5 రకాలున్నాయి. దాదాపు 12గంటలు ఫాస్టింగ్ ఉండి మిగతా టైంలో తింటారు. వారంలో 5రోజులు నార్మల్ డైట్ పాటించి మిగతా 2 రోజులు మాత్రం 500 నుంచి 600 లోపు క్యాలరీలు తీసుకుంటారు. వారానికి లేదా రెండు వారాలకోసారి ఒక రోజంతా ఫాస్టింగ్ ఉంటారు. రోజు విడిచి రోజు ఫాస్టింగ్ చేస్తారు. ఉదయం పూట పచ్చి కూరగాయలు, పండ్లు తిని రాత్రి పూట కడుపునిండా తింటారు.

షుగర్ ఉన్నవాళ్లు, చాలా రోజులుగా మెడిసిన్స్ వాడుతున్నవాళ్లు డైటింగ్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే, డైటింగ్ వల్ల వీళ్లకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గర్భం తర్వాత చాలామంది బరువు పెరుగుతారు. వీళ్లు బరువు తగ్గడం కోసం డైటింగ్ చేస్తే సరిపోను పోషకాలు అందుకని బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి.

గుర్తుపెట్టుకోవాల్సినవి

కనీసం 3 నుంచి 6 నెలల దాకా డైట్ ప్లాన్ పాటించాలి. అందుకని డైటింగ్ మొదలు పెట్టే రోజు నుంచి ఆపేసే వరకు మానసికంగా బలంగా ఉండాలి. ఒకవేళ ఫుడ్ పడకున్నా. ఆరోగ్యం. బాగుండకున్నా వెంటనే న్యూట్రిషనిస్ట్ ని కలవాలి. . అవసరమైతే కొన్ని రోజులు బ్రేక్ తీసుకోవాలి. అప్పుడప్పుడు చీటి మీల్స్ ఓకే. కానీ తరచూ స్వీట్స్, ఉంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. డైటింగ్తో పాటు ఎక్సర్ సైజ్ చేయడం బరువు దాదాపు 12 గంటలు ఫాస్టింగ్ ఉండి మిగతా నెమ్మదిగా నార్మల్ ఫుడ్ తీసుకోవాలి.

డా. సుజాత స్టీఫెన్, చీఫ్ న్యూట్రషనిస్ట్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్