ఇంట్లో ఇవి ఉంటే... అదృష్టం తలుపు తట్టినట్టే...

ఇంట్లో ఇవి ఉంటే... అదృష్టం తలుపు తట్టినట్టే...

ఎంత కష్ట పడ్డ ఫలితం రావడం ఉండటం లేదా.. ఎన్ని దేవుళ్లకు మొక్కినా నెగిటివ్ ఎనర్జీనే తాండవిస్తుందా.. ఏం చేసినా ఆర్ధిక ఇబ్బందులు తీరడ లేదా...ఎన్ని గుళ్లు గోపురాలు తిరిగినా అదృష్టం కలిసిరావడం లేదా.. ఎక్కడకి వెళ్లినా... దురదృష్టమే ఎదురవుతుందా.. ఇలా ఇబ్బంది పడే వారికి అదృష్టం కలిసిరావాలంటే ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టుకోవాలని పండితులు చెబుతున్నారు.   మరి అలాంటి వస్తువులు ఏమిటో  తెలుసుకుందాం...?

మనం ఏదైనా పని చేసేటప్పుడు నమ్మకంతో చేయాలని చెబుతున్నారు వేద పండితులు. ఆ నమ్మకమే జీవితాన్ని ముందుకు నడిపిస్తుందని నమ్ముతాం.  కష్టానికి తోడు అదృష్టం కలిసి వస్తే మరీ మంచిదని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు.  అయితే కొన్ని వస్తువులు ఇంట్లో ఉంటే అదృష్టం మన తలుపు తడుతుందని చెబుతున్నారు.  లక్ష్మీదేవి కటాక్షం వరించి .. ఆ వస్తువుల వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయని తద్వారా అదృష్టాన్ని కలిగిస్తాయని చెబుతున్నారు.

కొబ్బరి శుభ సూచకం (coconut):  ప్రతి పూజలో కూడా కొబ్బరికాయ, కొబ్బరి బొండాం, ఎండు కొబ్బరికి ప్రత్యేక స్థానం ఉంటుంది.  ఇవి లక్ష్మీ అమ్మవారికి ప్రతీక అని వేదాలు చెబుతున్నాయి.. అందుకే హిందే పూజల్లో  కొబ్బరికాయ కొబ్బరి బోండాం ప్రధానంగా ఉంటాయి.. కొబ్బరి కాయకు ప్రత్యేకస్థానం ఉంటుంది శుభకార్యాల్లో. కొబ్బరి కాయ కొట్టకుండా పూజ పూర్తికాదు.చిన్న ఎండు కొబ్బరి తీసుకొని దాన్ని పూజలో ఉంచి తర్వాత దాన్ని డబ్బు దాచే చోట పెట్టుకోవచ్చు. దీనివల్ల లక్ష్మీ కటాక్షం ఉంటుందని పండితులు సూచిస్తున్నారు.  అందుకే అదృష్టాన్ని తెచ్చే వస్తువుల్లో ఒకటైన కొబ్బరిని తెచ్చుకోవటం చాలా మంచిదని చెబుతుంటారు పండితులు 

తులసి మొక్క (tulasi plant): తులసి ఉన్న ఇల్లు ఆరోగ్యంతో, సుఖశాంతులతో, సిరిసంపదలతో తులతూగుతుందని ప్రతీతి.   మన సంప్రదాయంలో పురాణాల్లో తులసి మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది. తులసి మొక్క పవిత్రమైంది మాత్రమే కాదు, ఔషధాలు గని కలిగిన అద్భుతమైనర మొక్క కూడా. ఎవరి ఇంట్లో తులసి మొక్క ఉంటుందో ఆ ఇల్లు తీర్థ స్వరూపం అని శాస్త్రం చెబుతోంది. తులసిని వాకిట్లో పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవినిని ఆహ్వానించినట్లే.

తాబేలు బొమ్మ (Turtle ): తాబేలు ప్రతిమ సుఖశాంతులకు ప్రతీక అని వాస్తు శాస్త్రం చెబుతోంది. లోహపు తాబేలును ఇంట్లోకి తెచ్చుకుంటే మహాలక్ష్మి నడిచొస్తుందట. తాబేలు ప్రతిమ వల్ల ఆలస్యమైన పనులు..పెండింగ్ లో ఉన్న పనులు కూడా చకచకా జరిగిపోతాయట. ఇత్తడి, వెండి, గాజు తాబేలును ఇంటిలో ఉంచుకోవచ్చని పండితులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో తాబేలు బొమ్మ గల ఉంగరాలను ధరించటం చేస్తున్నారు.

ముత్యపు చిప్ప (pearl shell) : ముత్యపు చిప్ప సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. లక్ష్మీ దేవి మెడలో ముత్యాల హారం ఉంటుంది.ముత్యాలు కూడా సముద్ర గర్భం నుంచి పుట్టాయి కాబట్టి ముత్యపు చిప్పలు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవట. ముత్యపు చిప్ప ఉన్న ఇంట్లో డబ్బులకు కొదువే ఉండదట.

నెమలి ఈకలు (Peacock feathers): నెమలి ఈకలుఅంటే శ్రీకృష్ణుడు ఠక్కున గుర్తుకొస్తాడు. శిఖపించ మౌళి అంటారు నెమలి ఈకలను అలంకారంగా ధరించిన కిట్టయ్యని. నెమలి ఈకలంటే శ్రీకృష్ణుని కి చాలా ఇష్టం. నెమలి పించాన్ని తలమీద ధరించేవాడు. నెమలి పింఛం ఉన్నచోట లక్ష్మీ అమ్మవారు ఉంటారని పండితులు చెబుతున్నారు.