Good News : డిగ్రీతో సెంట్రల్​ జాబ్​

Good News : డిగ్రీతో సెంట్రల్​ జాబ్​

సీబీఐ, ఎన్​ఐఏ, సెంట్రల్​ బ్యూరో ఆఫ్​ నార్కోటిక్స్​, సీబీఐసీ లాంటి కేంద్ర సంస్థల్లో సబ్​ఇన్​స్పెక్టర్స్​​ సహా వివిధ విభాగాల్లో గ్రూప్‘-బి’, గ్రూప్-‘సి’ పోస్టుల భర్తీకి స్టాఫ్​ సెలెక్షన్​ కమిషన్​ ‘కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌‌‌‌(సీజీఎల్)-2024 నోటిఫికేషన్‌‌‌‌ త్వరలో విడుదల చేయనుంది. డిగ్రీ అర్హతతోనే సెంట్రల్​ కొలువుకు అవకాశం ఉన్న సీజీఎల్​ సెలెక్షన్​ ప్రాసెస్​ తెలుసుకుందాం..

సెంట్రల్​ కొలువుల్లో ప్రధానమైన పోస్టులు ఉండే సీజీఎల్​ నోటిఫికేషన్​ కోసం నిరుద్యోగులు ఎంతో ఎదురుచూస్తుంటారు. నాలుగు అంచెల్లో సెలెక్షన్​ ప్రాసెస్​ ఉండడంతో పాటు పోటీ తీవ్రంగా ఉంటుంది. సిలబస్​ను అవగాహన చేసుకొని సరైన ప్రణాళికతో ప్రిపరేషన్​ కొనసాగిస్తే కొలువు సాధించడం సులువే.

పోస్టులు : అసిస్టెంట్‌‌‌‌ ఆడిట్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌, అసిస్టెంట్‌‌‌‌ అకౌంట్స్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీస‌‌‌‌ర్‌‌‌‌,  అసిస్టెంట్‌‌‌‌/ సూప‌‌‌‌రింటెండెంట్‌‌‌‌, ఇన్‌‌‌‌స్పెక్టర్ (సెంట్రల్ ఎక్సైజ్‌‌‌‌), ఇన్‌‌‌‌స్పెక్టర్ (ప్రివెంటివ్ ఆఫీస‌‌‌‌ర్‌‌‌‌), ఇన్‌‌‌‌స్పెక్టర్ (ఎగ్జామిన‌‌‌‌ర్‌‌‌‌), అసిస్టెంట్ ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్ ఆఫీస‌‌‌‌ర్‌‌‌‌, స‌‌‌‌బ్ ఇన్‌‌‌‌స్పెక్టర్, ఇన్‌‌‌‌స్పెక్టర్ పోస్ట్స్‌‌‌‌, డివిజ‌‌‌‌న‌‌‌‌ల్ అకౌంట్స్‌‌‌‌, ఇన్‌‌‌‌స్పెక్టర్, స‌‌‌‌బ్ ఇన్‌‌‌‌స్పెక్టర్, జూనియ‌‌‌‌ర్ స్టాటిస్టిక‌‌‌‌ల్ ఆఫీస‌‌‌‌ర్‌‌‌‌, ఆడిట‌‌‌‌ర్‌‌‌‌, అకౌంటెంట్‌‌‌‌, అకౌంటెంట్‌‌‌‌/  జూనియ‌‌‌‌ర్ అకౌంటెంట్‌‌‌‌, సీనియ‌‌‌‌ర్ సెక్రటేరియ‌‌‌‌ట్ అసిస్టెంట్‌‌‌‌/ యూడీసీ, టాక్స్ అసిస్టెంట్‌‌‌‌, అప్పర్ డివిజ‌‌‌‌న్ క్లర్క్‌‌‌‌, రీసెర్చ్‌‌‌‌ అసిస్టెంట్, ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌.  

అర్హత : అసిస్టెంట్‌‌‌‌ ఆడిట్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌, అసిస్టెంట్‌‌‌‌ అకౌంట్స్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ పోస్టులకు గ్రాడ్యుయేషన్‌‌‌‌ పూర్తిచేసి, చార్టర్డ్‌‌‌‌ అకౌంటెన్సీ లేదా కాస్ట్ & మేనేజ్‌‌‌‌మెంట్ అకౌంటెంట్స్ లేదా కంపెనీ సెక్రటరీ/ ఎంకాం/  ఎంబీఏ(ఫైనాన్స్‌‌‌‌)/ మాస్టర్స్ ఇన్ బిజినెస్ ఎక‌‌‌‌నామిక్స్‌‌‌‌ ఉత్తీర్ణులై ఉండాలి
 జూనియర్‌‌‌‌ స్టాటిస్టికల్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ పోస్టుకు పోటీపడే అభ్యర్థులు 60 శాతం ఉత్తీర్ణతతో డిగ్రీ పూర్తిచేసి, 10+2లో మ్యాథ్స్​ సబ్జెక్టుగా చదివి ఉండాలి. లేదా గ్రాడ్యుయేషన్‌‌‌‌లో స్టాటిస్టిక్స్‌‌‌‌ ఒక సబ్జెక్టుగా చదివిన అభ్యర్థులు కూడా ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

రీజనింగ్‌‌‌‌ అండ్‌‌‌‌ జనరల్‌‌‌‌ ఇంటెలిజెన్స్‌‌‌‌ : నాన్‌‌‌‌ వెర్బల్, హైలెవల్‌‌‌‌ రీజనింగ్, పజిల్స్‌‌‌‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. టైర్‌‌‌‌-1, టైర్‌‌‌‌-2లో ప్రశ్నలు వస్తాయి కాబట్టి ఎక్కువ స్థాయి ఉండే ప్రశ్నలు ప్రాక్టీస్​ చేయాలి. అనాలజీ, సిరీస్, కోడింగ్‌‌‌‌- డీ–కోడింగ్, ఇన్‌‌‌‌పుట్‌‌‌‌-అవుట్‌‌‌‌పుట్, క్లాక్, క్యాలండర్, దిక్కులు, రక్త సంబంధాలు, క్యూబ్, డైస్, వెన్‌‌‌‌ చిత్రాలు, పజిల్స్, సిలాజిజమ్, ర్యాంకింగ్‌‌‌‌ సీక్వెన్స్‌‌‌‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి.

క్వాంటిటేటివ్​ ఆప్టిట్యూడ్ ​:  సింప్లిఫికేషన్​, ఇంట్రెస్ట్, యావరేజెస్​, పర్సెంటేజ్​, రేషియో & ప్రపోర్షన్​, ప్రా బ్లమ్​ ఆన్​ ఏజెస్​, టైం & వర్క్​, ఆల్​జీబ్రా, ట్రిగనోమెట్రీ, జామెట్రీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. లాజిక్, టెక్నిక్, షార్ట్‌‌‌‌కట్‌‌‌‌లు వాడి తక్కువ సమయంలో సమాధానాలు గుర్తించాలి. ఎక్కువ ప్రశ్నలను సాధన చేయడం వల్ల సబ్జెక్టు మీద పట్టు సాధించవచ్చు. ఎలాంటి ప్రశ్నలకు తప్పు సమాధానాలు గుర్తిస్తున్నామో గమనించి వాటిని మెరుగుపరుచుకోవాలి. 

ఇంగ్లీష్​ లాంగ్వేజ్​ & కాంప్రహెన్షన్ ​: రీడింగ్​ కాంప్రహెన్షన్​, ఫిల్​ ఇన్​ ద బ్లాంక్స్​, స్పెల్లింగ్స్​, ప్రేజస్ & ఇడియమ్స్, వన్​ వర్డ్​ సబ్​స్టిట్యూషన్​, సెంటెన్స్​ కరెక్షన్​, ఎర్రర్​ స్పాటింగ్​, సినోనిమ్స్​, ఆంటోనిమ్స్​, ఇడియమ్స్​ &ఫ్రేజెస్​. గ్రామర్‌‌‌‌ మీద పూర్తి అవగాహన ఉండాలి. రీడింగ్‌‌‌‌ స్కిల్‌‌‌‌ మెరుగుపరుచుకోవడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ సమాచారం చదవడం అలవాటు చేసుకోవాలి. ప్రతి అంశం నుంచి కనీసం 200 ప్రశ్నలు సాధన చేస్తే ఇంగ్లీష్‌‌‌‌ విభాగం నుంచి ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు. 

కంప్యూటర్‌‌‌‌ ప్రొఫిషియన్సీ : కంప్యూటర్‌‌‌‌ బేసిక్స్, సెంట్రల్‌‌‌‌ ప్రాసెసింగ్‌‌‌‌ యూనిట్, ఇన్‌‌‌‌పుట్‌‌‌‌-అవుట్‌‌‌‌పుట్, డివైజెస్, కంప్యూటర్‌‌‌‌ మెమరీ, మెమరీ ఆర్గనైజేషన్, బ్యాక్‌‌‌‌అప్‌‌‌‌ డివైజెస్, విండోస్‌‌‌‌ ఎక్స్‌‌‌‌ప్లోరర్, కీబోర్డ్‌‌‌‌ షార్ట్‌‌‌‌కట్స్, సాఫ్ట్‌‌‌‌వేర్, మైక్రోసాఫ్ట్‌‌‌‌ ఆఫీస్, ఎంఎస్‌‌‌‌-వర్డ్, ఎంఎస్‌‌‌‌-ఎక్సెల్, పవర్‌‌‌‌ పాయింట్, సైబర్‌‌‌‌ సెక్యూరిటీ, ఇంటర్నెట్, ఈమెయిల్, నెట్‌‌‌‌వర్కింగ్‌‌‌‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి. 

ఎగ్జామ్​ ప్యాటర్న్​:  టైర్​1లో ఎలాంటి మార్పులు చేయకుండా గతంలో మాదిరిగానే ఉంటుంది. 100 ప్రశ్నలను 4 విభాగాలుగా విభజించి, ప్రతి విభాగం నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. నెగెటివ్​ మార్కింగ్ 0.5 ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు కేటాయిస్తారు. టైర్​1లో క్వాలిఫై అయిన అభ్యర్థులను టైర్​2కి ఎంపిక చేస్తారు. 

ప్రిపరేషన్​ ప్లాన్​ 

జనరల్‌‌‌‌ అవేర్‌‌‌‌నెస్‌‌‌‌ : కరెంట్‌‌‌‌ అఫైర్స్‌‌‌‌ నుంచి వార్తల్లోని వ్యక్తులు, క్రీడలు, అవార్డులు, ముఖ్యమైన తేదీలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, దేశాలు, రాజధానులు, ప్రధాన మంత్రులు, రాష్ట్రపతి, కేపిటల్, కరెన్సీల నుంచి ప్రశ్నలు వస్తాయి. రోజువారీ దిన పత్రికల్లోని ముఖ్యమైన వార్తలను, వాటికి అనుసంధానంగా ఉన్న ఇతరత్రా సమాచారం సేకరించాలి. ప్రాథమిక విశ్లేషణతో ఆలోచిస్తూ అంశాలవారీగా ప్రిపరేషన్‌‌‌‌ కొనసాగించాలి. 

జనరల్‌‌‌‌ సైన్స్‌‌‌‌లో ఇన్‌‌‌‌వెన్షన్స్‌‌‌‌- డిస్కవరీస్, మెజర్‌‌‌‌మెంట్స్, థీరీస్, కెమికల్‌‌‌‌ ఫార్ములా, ప్లాంట్, హ్యూమన్‌‌‌‌ బాడీస్, వ్యాక్సిన్, వైరస్‌‌‌‌ తదితర అంశాలు ముఖ్యమైనవి. చరిత్రకు సంబంధించి భారతదేశ చరిత్ర, మధ్యయుగం, ఆధునిక యుగాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. రాజ్యాలు, స్థాపకులు, యుద్ధాలు, గవర్నర్‌‌‌‌ జనరల్స్, గాంధీయుగం, ఉద్యమాలు ముఖ్యమైనవి. జాగ్రఫీ నుంచి నదులు, పర్వతాలు, నేలలు, సరిహద్దులు, అడవులు, వాతావరణం, పక్షులు, జంతు సంరక్షణ - పరిరక్షణ, సంబంధిత అంశాల నుంచి ఎక్కువ సమాచారం సేకరించాలి.

పాలిటీలో ప్రాథమిక హక్కులు, రాష్ట్రపతి, పార్లమెంట్, అధికరణలు, సవరణలు ముఖ్యమైనవి. ఎకానమీ నుంచి డిమాండ్‌‌‌‌- సప్లయ్, ద్రవ్యోల్బణం, పేదరికం, మార్కెట్‌‌‌‌ రకాలు, జాతీయ- అంతర్జాతీయ సమకాలీన అంశాలపై దృష్టి పెట్టాలి. ప్రతి రోజు న్యూస్​ పేపర్స్​ లో వచ్చే సమకాలీన అంశాలను సబ్జెక్ట్​తో అనుసంధానం చేసుకుని ప్రిపరేషన్​ కొనసాగించాలి. 

ఎగ్జామ్​ ప్యాటర్న్​

టయర్​​1 :  టయర్​ 1 ఎగ్జామ్​ 200 మార్కులకు ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలిస్తారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. ఎగ్జామ్​ డ్యురేషన్​ 60 నిమిషాలు ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి అర మార్కు కోత విధిస్తారు.

టయర్​​ 2 : టయర్​​ 1లో క్వాలిఫై అయిన అభ్యర్థికి టైర్​ 2 ఉంటుంది.  ఇది కూడా కంప్యూటర్​ బేస్డ్​ ఎగ్జామ్​. టైర్​ 1 ఎగ్జామ్​లా కాకుండా ఇక్కడ ప్రతి సబ్జెక్ట్​కు 200 మార్కులు ఉంటాయి. రెండు గంటల టైం ఉంటుంది. టైర్​ 2లో ఇంగ్లీష్​ లాంగ్వేజ్​ & కాంప్రహెన్షన్​ విభాగంలో ప్రతి తప్పు ఆన్సర్​కు పావుమార్కు, మిగతా విభాగాల్లో ప్రతి తప్పు ఆన్సర్​కు అర మార్కు తగ్గిస్తారు.

టయర్​​ 3 : టయర్​ 3 పూర్తిగా డిస్క్రిప్టివ్​ టైప్​ పేపర్​. అభ్యర్థులు గంట టైంలో ఇంగ్లీష్​ లేదా హిందీ భాషలో ఎస్సేలు/ లెటర్​/ అప్లికేషన్ రైటింగ్​ రాయాల్సి ఉంటుంది.​ 100 మార్కులకు నిర్వహించే ఈ పరీక్ష క్వాలిఫైయింగ్​ ఎగ్జామ్​.

టయర్​ 4 : మూడు దశల్లో ప్రతిభ చూపించి టైర్​ 4 కు ఎంపికైన అభ్యర్థులకు టయర్​​ 4లో పోస్టును బట్టి కంప్యూటర్​ ప్రొఫిషియన్సీ టెస్ట్​ లేదా స్కిల్​ టెస్ట్​ లేదా డాక్యుమెంట్​ వెరిఫికేషన్​ ఉంటుంది. సెంట్రల్​ సెక్రటేరియట్​ సర్వీస్​లో అసిస్టెంట్​ సెక్షన్​ ఆఫీసర్​, ఎస్​ఎఫ్​ఐవో తదితర కొన్ని పోస్టులకు కంప్యూటర్​ ప్రొఫిషియన్సీ టెస్ట్​ ఉంటుంది. ఈ టెస్ట్​లో వర్డ్​ ప్రాసెసింగ్​, స్ప్రెడ్​ షీట్​, జనరేషన్​ ఆఫ్​ స్లైడ్స్​ ఉంటాయి. సెంట్రల్​ ఎక్సైజ్​ & ఇన్​కం ట్యాక్స్​ డిపార్ట్​మెంట్​లో ట్యాక్స్​ అసిస్టెంట్​ పోస్టుకు డేటా ఎంట్రీ స్పీడ్​ గంటకు 8 వేల కీ డిప్రెషన్​ ఉండాలి.

టయర్​​1: 

సెక్షన్​                                                        మార్కులు

జనరల్​ ఇంటెలీజెన్స్​ & రీజనింగ్              50
జనరల్​ అవేర్​నెస్                                           50
క్వాంటిటేటివ్​ ఆప్టిట్యూడ్​                             50
ఇంగ్లీష్​ లాంగ్వేజ్​ అండ్​ కాంప్రహెన్షన్​       50
మొత్తం                                                               200

టయర్​​ 2                                       పేపర్​1, సెక్షన్‑1

మ్యాథ్స్​                                                                                        90
రీజనింగ్​ అండ్​ జనరల్​ ఇంటెలిజెన్స్                                 90

 

సెక్షన్​2

ఇంగ్లీష్​                                                                                         135
జనరల్​ అవేర్​నెస్                                                                      90

సెక్షన్​ 3

కంప్యూటర్​ నాలెడ్జ్​                                                                   60
పేపర్​1, సెషన్ ​2

డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ – 15 నిమిషాలు

పేపర్​2 స్టాటిస్టిక్స్​                                      200
పేపర్​3 జనరల్​ స్టడీస్​                              200