
బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 04.
పోస్టుల సంఖ్య: స్పోర్ట్స్ కోటాలో గ్రూప్– సి కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు భర్తీ చేయనున్నారు.
ఎలిజిబిలిటీ: పదో తరగతి లేదా సమాన అర్హత ఉండాలి . గత రెండు సంవత్సరాల్లో నోటిఫికేషన్ పేరా 4 (బి) ప్రకారం పోటీలో పాల్గొన్న లేదా పతకాలు గెలుచుకున్న క్రీడాకారులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
ఫిజికల్ స్టాండర్డ్స్: పురుషులు 170 సెం.మీ.లు, మహిళలు 157 సెం.మీ.ల ఎత్తు ఉండాలి. పురుష అభ్యర్థుల ఛాతీ చుట్టు కొలత 80 సెం.మీ.లు ఉండాలి. కనీసం 5 సెం.మీ.లు వ్యాకోచించాలి.
వయోపరిమితి: 18 నుంచి 23 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్లు ప్రారంభం: అక్టోబర్ 16.
లాస్ట్ డేట్: నవంబర్ 04.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు. జనరల్, ఓబీసీ పురుష అభ్యర్థులు రూ.159 చెల్లించాలి.
సెలెక్షన్ ప్రాసెస్: అభ్యర్థులు అప్లోడ్ చేసిన ఆన్లైన్ దరఖాస్తులను, సర్టిఫికెట్ కాపీలను పరిశీలించి మార్కులు కేటాయిస్తారు. కనీసం 12 మార్కులు (అన్ని కేటగిరీల అభ్యర్థులకు) సాధించిన అభ్యర్థులకు నియామక ప్రక్రియకు హాజరుకావడానికి ఆన్లైన్ అడ్మిట్ కార్డులను జారీ చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్టీ), మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.
పూర్తి వివరాలకు bsf.gov.in వెబ్సైట్లో సంప్రదించగలరు.