LIC ఉద్యోగులు, ఏజెంట్లకు గుడ్ న్యూస్.. గ్రాట్యుటీ, పెన్షన్ పెంచిన కేంద్ర ప్రభుత్వం

LIC ఉద్యోగులు, ఏజెంట్లకు గుడ్ న్యూస్.. గ్రాట్యుటీ, పెన్షన్ పెంచిన కేంద్ర ప్రభుత్వం

LIC ఉద్యోగులు, ఏజెంట్ల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏజెంట్లకు, ఉద్యోగులకు గ్రాట్యుటీ పరిమితి, కుటుంబ పెన్షన్ను పెంచుతూ కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్లు సోమవారం ( సెప్టెంబర్ 18) ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం 3 లక్షలు ఉన్న గ్రాట్యుటీని 5 లక్షలకు పెంచింది. 

సంక్షేమ చర్యల్లో భాగంగా ఎల్ ఐసీ( ఏజెంట్లు) నిబంధనలు 2017, గ్రాట్యుటీ పరిమితులు,  కుటుంబ పెన్షన్ ఏకరీతి రేటులో సవరణ చేశారు. ఎల్ఐసీ ఏజెంట్ల పని, ప్రయోజనాల్లో మెరుగు పర్చే లక్ష్యంతో గ్రాట్యుటీ పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచింది కేంద్ర ప్రభుత్వం. 

ఏజెంట్లకు ప్రస్తుతం టర్మ్ ఇన్స్యూరెన్స్ కవర్ రూ. 3 వేల నుంచి 10 వేలుండగా.. రూ. 25 వేల నుండి లక్షా 50 వేలకు విస్తరించింది. టర్మ్ ఇన్స్యూరెన్స్ లో మెరుగుదల మరణించిన ఏజెంట్ల కుటుంబాలకు లబ్ధి కలిగిస్తుంది. ఎల్ ఐసీ ఉద్యోగుల కుటుంబాల సంక్షేమం కోసం 30 శాతం కుటుంబ పెన్షన్ ను ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించింది. 

దేశంలో మొత్తం 13 లక్షల మంది ఏజెంట్లు, లక్ష మందికి పైగా రెగ్యులర్ ఉద్యోగులు ఎల్ ఐసీ వృద్ధిలో , బీమా విస్తరణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరంతా ఎల్ ఐసీ సంక్షేమ చర్యలద్వారా లబ్ధి పొందుతారు. 

రూ. 5 కోట్ల ప్రారంభం పెట్టుబడితో 1956లో  ప్రారంభించబడిన ఎల్ ఐసీ సంస్థ.. 2023 మార్చి 31 నాటికి రూ. 40.81లక్షల కోట్ల బీమా నిధితో రూ. 45.50లక్షల కోట్ల ఆస్తిని కలిగి వుంది. 

మెరుగైన గ్రాట్యుటీ: అధికారిక విడుదల ప్రకారం, LIC ఏజెంట్లకు గ్రాట్యుటీ పరిమితిని ప్రస్తుత 3 లక్షల నుండి ₹5 లక్షలకు పెంచుతారు. దీని వల్ల ఎల్‌ఐసి ఏజెంట్ల పని పరిస్థితులు మరియు ప్రయోజనాలకు గణనీయమైన మెరుగుదలలు వస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.