గోల్డ్‌ కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్

గోల్డ్‌ కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్

యూఎస్‌ డాలర్‌ మళ్లీ బలం పుంజుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,038 డాలర్ల వద్ద ఉండగా.. మన దేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ధర. 600గా ఉంది. స్వచ్ఛమైన పసిడి ధర రూ.650, 18 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.500 చొప్పున తగ్గాయి. వెండి రేటులో ఎలాంటి మార్పు లేదు.

తెలంగాణలో బంగారం, వెండి ధరల విషయానికొస్తే హైదరాబాద్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57వేల 500, 24 క్యారెట్ల బంగారం ధర రూ.62వేల 730 గా నమోదయ్యాయి. 18 క్యారెట్ల బంగారం ధర రూ.47వేల40 ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.82వేల 200గా ఉంది. ఏపీ, తెలంగాణ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 58,650 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,980 కి చేరింది. ముంబయిలో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు వరుసగా రూ.57, 500, రూ. 62,730గా ఉన్నాయి. ఢిల్లీలో ఈ ధరలు రూ.58,260, రూ.63,540 గా ఉన్నాయి.