ఇక నుంచి టెక్‌ ఉద్యోగులకూ యూనియన్లు​

ఇక నుంచి టెక్‌ ఉద్యోగులకూ యూనియన్లు​

టెక్‌ ఉద్యోగులకు యూనియన్లు​

గూగుల్‌ సంఘటనతో మొదలైన చర్చ

మొదటిసారిగా వైట్ కాలర్‌‌(ప్రొఫెషనల్‌) ఎంప్లాయీస్‌కు యూనియన్లు

ఇప్పటికే కొన్ని సిటీలలో పనిచేస్తున్న ఇండస్ట్రీ యూనియన్లు

కానీ ఇప్పటి వరకు ఏర్పడని ఆర్గనైజేషన్‌ యూనియన్లు

బిజినెస్ ‌డెస్క్‌, వెలుగు: కంపెనీ మేనేజ్‌మెంట్‌కు తమ వాయిస్‌ వినిపించడంలో ఓ ఉద్యోగ సంఘం ఉండాలని ఇండియన్ టెక్‌ ఎంప్లాయీస్‌ భావిస్తున్నారు. కొన్ని సిటీలలో ఇండస్ట్రీ మొత్తానికి కలిపి ఉద్యోగ సంఘాలు పనిచేస్తున్నప్పటికీ, కంపెనీలకు చెందిన వర్కర్స్‌ యూనియన్‌ అంటూ ఇప్పటి వరకు ఏది ఏర్పడలేదు.  కానీ తాజాగా గూగుల్‌, ఆల్ఫాబెట్‌ కంపెనీలకు చెందిన 400 పైగా ఉద్యోగులు ఓ ఎంప్లాయీస్ యూనియన్‌ను  ఏర్పాటు చేశారు. ఈ కంపెనీలలో వర్కింగ్‌ పరిస్థితులు అధ్వాన్నంగా తయారవుతున్నాయని ఈ యూనియన్‌ ప్రధానంగా ఆరోపిస్తోంది. కాగా, గూగుల్‌కి మొత్తం 2.6 లక్షల మంది ఫుల్‌ టైమ్‌ ఉద్యోగులున్నారు. దీంతో పోలిస్తే ఈ యూనియన్‌ సైజు చాలా చిన్నదైనప్పటికీ, ఇప్పటి వరకు ఏ టెక్‌ కంపెనీకి సపరేట్‌గా యూనియన్ అంటూ ఏర్పడ లేదు. ఇది ప్రారంభమేనని, కంపెనీ మేనెజ్‌మెంట్‌ నుంచి ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు ఒక యూనియన్ అంటూ ఉండాలని ఎనలిస్టులు పేర్కొంటున్నారు.

ట్రేడ్ యూనియన్ చట్టాల కిందకు టెక్ వర్కర్స్

ఇండియాలో బ్లూ కాలర్ వర్కర్లు(లేబర్లు), ప్రభుత్వ కంపెనీలకు ఉద్యోగ సంఘాలున్నాయి. కానీ వైట్ కాలర్‌‌(ప్రొఫెషనల్‌) ఎంప్లాయీస్‌కు ఎటువంటి యూనియన్లు లేవు. ప్రస్తుతం వైట్ కాలర్‌‌, సర్వీస్‌ సెక్టార్లలో యూనియన్లకు డిమాండ్‌ ఏర్పడుతోందని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.  2017 నుంచి ఐటీ, ఐటీఈఎస్ సెక్టార్లకు చెందిన ట్రేడ్‌ యూనియన్లు రిజిస్టర్‌‌ అవుతున్నాయని నిషిత్‌ దేశయ్‌ అసోసియేట్స్‌ ఎనలిస్ట్ అజయ్‌ సింగ్‌ సోలంకి పేర్కొన్నారు. ఉదాహరణకు టెక్ సిటీ బెంగళూరులో కర్నాటక స్టేట్‌ ఐటీ, ఐటీఈఎస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(కేఐటీయూ) రిజిస్టర్‌‌ అయ్యిందని గుర్తు చేశారు. వైట్‌ కాలర్ ఉద్యోగులు యూనియన్లను ఏర్పాటు చేయకూడదని, ఇవి ట్రేడ్‌ యూనియన్‌ చట్టాల కిందకు రావనేది తప్పుడు ఆలోచన అని సోలంకి పేర్కొన్నారు. ఈ యూనియన్లు కూడా ట్రేడ్‌ యూనియన్‌ చట్టాల కిందకు వస్తాయని పేర్కొన్నారు. 2018 లో ఏర్పడిన  కోల్‌కతాకు చెందిన ఆల్‌ ఇండియా ఐటీ అండ్ ఐటీఈఎస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(ఏఐఐటీఈయూ) తాజాగా జరిగిన గూగుల్‌ ఈవెంట్‌పై కామెంట్ చేసింది. టెక్‌ సెక్టార్‌‌లో యూనియన్‌ను ఏర్పాటు చేయడం చాలెంజింగ్‌గా ఉండేదని ఈ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ సౌభిక్ భట్టాచార్య అన్నారు. ప్రస్తుతం యూనియన్‌ను ఏర్పాటు చేయడంపై టెక్ ఉద్యోగులు చాలా ఆసక్తిగా ఉన్నారని పేర్కొన్నారు. కరోనా సంక్షోభం వలన టెక్ ఇండస్ట్రీలో పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించారు. జీతాల కోత, ఓవర్‌‌ వర్క్‌ వంటి అంశాలతో ఉద్యోగులు విసిగిపోయారని బట్టాచార్య పేర్కొన్నారు.

గూగుల్‌‌ ఈవెంట్‌‌ ప్రారంభమే..

ఆల్ఫాబెట్‌‌ వర్కర్స్‌‌ యూనియన్‌‌ సంఘటన చిన్నదైనప్పటికీ దీన్ని పక్కన పెట్టలేమని గ్జావియర్‌‌ స్కూల్‌‌ ఆఫ్ మేనేజ్‌‌మెంట్‌‌(ఎక్స్‌‌ఎల్‌‌ఆర్‌‌‌‌ఐ) లేబర్ ఎకనామిస్ట్‌‌ కేఆర్ శ్యామ్‌‌ సుందర్‌‌‌‌ పేర్కొన్నారు. ఇది కేవలం ఓ నీటి బిందువే కావొచ్చు కానీ నదిలా మారే అవకాశం ఉందని, పెద్ద మొత్తంలో ఉద్యోగులను ఆకర్షించగలదని అభిప్రాయపడ్డారు. ‌‌యూనియన్లను విస్తరించాలంటే ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు ఉద్యోగ సంఘాలు పనిచేయాలని సుందర అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కొన్ని సిటీలలో టెక్ వర్కర్స్‌‌ యూనియన్లు యాక్టివ్‌‌గా పనిచేస్తున్నాయని అయినప్పటికీ అవి విస్తరించలేకపోయాయని నిషిత్‌ దేశయ్‌ అసోసియేట్స్‌ ఎనలిస్ట్‌ అజయ్‌ సింగ్‌ సోలంకి చెప్పారు. బ్లాక్‌‌ లిస్ట్‌‌లో పెడతారని లేదా ఉద్యోగం నుంచి తీసేస్తారని ఎంప్లాయీస్‌‌ భయపడుతున్నారని అన్నారు.ఒకప్పటి యూనియన్లలా కాకుండా వర్కర్ల విభజన, జండర్ ఈక్విటీ వంటి అంశాలపై పనిచేయాలని సూచించారు. గూగుల్‌‌లో ఏర్పడినట్టు ఒక ఆర్గనైజేషన్‌‌కు చెందిన వర్కర్స్ యూనియన్ ఇండియాలో ఏర్పడడం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. కావాలంటే ఇండస్ట్రీకి చెందిన యూనియన్‌లలో జాయిన్‌‌ అవ్వడానికే ఎక్కువ ఆసక్తి