AIతో కొత్త ఉద్యోగాలు ఒక బూటకపు హామీ.. అసలు మ్యాటర్ చెప్పిన గూగుల్ ఎగ్జిక్యూటివ్..!

AIతో కొత్త ఉద్యోగాలు ఒక బూటకపు హామీ.. అసలు మ్యాటర్ చెప్పిన గూగుల్ ఎగ్జిక్యూటివ్..!

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని ముందుకు తీసుకెళుతున్న నూతన సాంకేతికత. దీని పురోగతి మానవాళి జీవితాలను ఎంత సులభతరం చేస్తుందో.. అంతే ప్రమాదకరం కూడా అనే వాదనలు ఉన్నాయి. కానీ.. పెద్దపెద్ద ఐటీ కంపెనీల సీఈవోలు, స్థాపకులు కూడా ఏఐతో కొత్త ఉద్యోగాలు వస్తాయని కేవలం ఇదొక మార్పుకు సంకేతం మాత్రమేనంటూ కవరింగ్ చేస్తున్నారు. అయితే అసలు కంపెనీల యాజమానులు చెబుతున్నది 100 శాతం అబద్ధంగా తెలుస్తోంది. 

అయితే అసలు ఏఐ సాంకేతికత కొత్తగా ఉద్యోగాలను సృష్టించలేదని మాజీ గూగుల్ బిజినెస్ ఆఫీసర్ వాస్తవాన్ని ఒక ఇంటర్వ్యూలో కుండబద్ధలు కొట్టినట్టు బయటపెడ్డారు. కార్పొరేట్ శక్తులు తమ మనుగడ కోసం ప్రజలను మభ్యపెట్టేందుకే ఏఐతో కొత్త ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వస్తాయని చెబుతున్నట్లు మో గ్వదత్ చెప్పారు. ఇది వాస్తవం అనటానాకి ఆయన స్థాపించిన ఎమ్మా.లవ్ అనే స్టార్టప్ ఒక సాక్ష్యంగా ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టును కేవలం ముగ్గురు ఉద్యోగులు ఏఐ సాయంతో డెవలప్ చేశారని.. కానీ గతంలో ఇలాంటి యాప్ తయారీకి దాదాపు 350 మంది టెక్కీలు అవసరం అయ్యేవారని చెప్పారాయన.

గ్వదత్ గూగుల్ సంస్థలో దాదాపు 5 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఏఐ యుగంలో ఏ ఉద్యోగమూ సేఫ్ అని చెప్పటానికి వీలు లేదని చెప్పారు. రానున్న కాలంలో వీడియో ఎడిటర్లు, పాడ్ క్యాస్టర్లు, ఎగ్జిక్యూటివ్స్ జాబ్స్ గల్లంతౌతాయని చెప్పారు. అలాగే బిల్ గేట్స్ చెప్పినట్లుగా డాక్టర్లు, టీచర్లు కూడా భవిష్యత్తులో ఏఐతో రీప్లేస్ చేయబడతారని చెప్పారు.

ALSO READ : టెక్కీలపై బాంబు పేల్చిన మైక్రోసాఫ్ట్..

భవిష్యత్తులో అన్ని రంగాల్లోనూ సాంకేతికత మనుషుల మేధస్సును మించి దూసుకుపోగలదని చెప్పారు. దీంతో పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలను కూడా నిడిపించే సీఈవోల పనితీరు బాగోకపోతే వారిని కూడా ఏఐ రీప్లేస్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.