
న్యూఢిల్లీ: యూరోపియన్ కమీషన్ వేసిన ఫైన్‌ను గూగుల్ చెల్లించాల్సిందేనని యూరోపియన్ జనరల్ కోర్టు బుధవారం తీర్పిచ్చింది. ఆన్‌లైన్‌లో తనకు ఉన్న ఆధిపత్యాన్ని ఉపయోగించుకొని కొన్ని షాపింగ్ సర్వీస్‌లను యూజర్లకు గూగుల్ రికమండ్ చేస్తోందని 2017 లో యూరోపియన్ కమీషన్ ఆరోపించింది. ఫైన్ కింద 2.8 బిలియన్ డాలర్ల (రూ. 20,720 కోట్ల) ను చెల్లించాలని అప్పుడు తీర్చిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ యూరప్ టాప్ కోర్టుకు గూగుల్ వెళ్లిన విషయం తెలిసిందే. యూరోపియన్ కమీషన్ తీర్పును సమర్ధిస్తూ ఈ కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది.