
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు గూగుల్ యాజమాన్యం వేజ్ యాప్ (waze) తీసుకురాబోతోంది. వాహనం నడిపేటప్పుడు డ్రైవర్ నిర్లక్ష్యం, ఇతర కారణాలవల్లనో ఈ మధ్య కాలంలో యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి. అయితే, ఈ యాప్ రోడ్డుపై ఎక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉందో ముందే గుర్తించి డ్రైవర్ కి పాప్ అప్ మెసేజ్ ఇస్తుంది. అంతేకాకుండా ఈ యాప్ లో రోడ్డు మార్గాలు, ట్రాఫిక్ రద్దీ, గత రోడ్డు ప్రమాదాల చరిత్ర మొత్తం నిక్షిప్తమై ఉంటుంది.
ఈ ఇన్ఫర్మేషన్ సాయంతో డ్రైవర్ వాహనం నడిపేటప్పుడు ప్రమాదాలు జరిగే స్థలాలను ఇండికేషన్ ఇచ్చి, అలర్ట్ చేస్తుంది. అయితే, ప్రస్తుతం బీటా టెస్టింగ్ స్టేజ్ లో ఉన్న ఈ యాప్, త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ యాప్ తో పాటు గూగుల్ మాప్స్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ని కూడా త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు.