ఆస్ట్రేలియాతో గూగుల్​ కయ్యం

ఆస్ట్రేలియాతో గూగుల్​ కయ్యం

ప్రతిపాదిత న్యూస్​ మీడియా చట్టంపై కస్సుబుస్సులు

సిడ్నీ: ఆస్ట్రేలియా ప్రభుత్వం, గూగుల్​ నువ్వెంతంటే నువ్వెంత అనేలా కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ఆ దేశ ప్రభుత్వం తీసుకురా వాలనుకుంటున్న న్యూస్​ మీడియా చట్టంపై గూగుల్​ గుర్రుగా ఉంటే.. సర్కార్​ మాత్రం తాము చెప్పింది వినాల్సిందేనని తేల్చి చెబు తోంది. స్థానిక మీడియా సంస్థల వార్తలను పబ్లిష్​ చేసే పెద్ద పెద్ద టెక్​ కంపెనీలు.. ఆయా మీడియాలకు చెల్లింపులు చేసేందుకు ఆస్ట్రేలియా సర్కార్​ ఈ కొత్త చట్టాన్ని తీసుకొస్తోంది. చట్టం ప్రకారం స్థానిక మీడియా సంస్థలు నేరుగా గూగుల్​తో చెల్లింపులపై చర్చించుకోవచ్చు. ఒకవేళ డీల్​ కుదరకపోతే ప్రభుత్వం మధ్యవర్తిగా ఉండి డీల్​ కుదిరేలా చేస్తుంది.

సేవలు ఆపేస్తం: గూగుల్​

ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని తీసుకొస్తే దేశంలో సేవలను ఆపేస్తామని గూగుల్​ హెచ్చరించింది. ఇలాంటి మధ్యవర్తిత్వాల వల్ల గూగుల్​కు ఇటు ఆర్థికంగా, అటు ఆపరేషన్స్​ పరంగా ఇబ్బందులు వస్తాయని కంపెనీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​ మేనేజింగ్​ డైరెక్టర్​ మెల్​ సిల్వ అన్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే సేవలు నిలిపేయడం తప్ప తమకు వేరే దారి లేదని తేల్చి చెప్పారు.

బెదిరింపులకు భయపడం: ఆస్ట్రేలియా ప్రధాని

గూగుల్​ కామెంట్లపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్​ బదులిచ్చారు. బెదిరింపులకు భయపడబోమని తేల్చి చెప్పారు. ‘‘దేశంలో మీరేం చేయాలో నిర్ణయించాల్సింది మేం. మా ప్రభుత్వం, మా పార్లమెంట్​ నిర్ణయాలు తీసుకుంటాయి. ఆస్ట్రేలియాలో ఉండాలనుకుంటే మా రూల్స్​ ప్రకారం నడుచుకోవాల్సిందే. కానీ, బెదిరింపులకు దిగుతామంటే మాత్రం భయపడేది లేదు’’ అని తేల్చి చెప్పారు.

ఇవి కూడా చదవండి

రైతులతో ఇక మాటల్లేవ్​..

కిలిమంజారో పర్వతమెక్కిన హైదరాబాద్ సీపీ

V6 రేటింగ్​పై కుట్ర.. రేటింగ్​ పెరగకుండా ప్రయత్నాలు