ఆండ్రాయిడ్ 11 బెటా వెర్షన్ రిలీజ్ పోస్ట్ పోన్

ఆండ్రాయిడ్ 11 బెటా వెర్షన్ రిలీజ్ పోస్ట్ పోన్

స్పష్టం చేసిన గూగుల్ 

యూఎస్ లో నిరసనలే కారణం

న్యూఢిల్లీ: లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ ఆవిష్కరణపై ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ కీలక ప్రకటన చేసింది. వచ్చే వారం విడుదల చేద్దామనుకున్న ఆండ్రాయిడ్ 11 మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ బెటా వెర్షన్ ను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు పేర్కొంది. యునైటెడ్ స్టేట్స్ లో జరుగుతున్న నిరసనల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ స్పష్టం చేసింది.

‘ఆండ్రాయిడ్ 11 గురించి చెప్పాలని చాలా ఎగ్జైట్ మెంట్ తో ఉన్నాం. కానీ సెలబ్రేషన్స్ కు ఇది సరైన టైమ్ కాదు’ అని ఆండ్రాయిడ్ డెవలపర్స్ వెబ్ సైట్ లో పోస్ట్ చేసిన మెసేజ్ లో గూగుల్ ఈ విషయం తెలిపింది. వెబ్ సైట్ ప్రకారం.. వచ్చే బుధవారం వర్చువల్ గా ఈ కార్యక్రమం జరగాల్సింది. కానీ నల్ల జాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్ హత్యపై యునైటెడ్ స్టేట్స్ అంతటా నిరసనలు వ్యాపించడంతో గూగుల్ వాయిదా నిర్ణయం తీసుకుంది. కాగా, గూగుల్ చేసిన ఓ ట్వీట్ లో.. ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్ కు సంబంధించిన మరిన్ని విశేషాలను త్వరలోనే చెబుతామని పేర్కొంది.