‘వియర్ ఏ మాస్క్‌’: అట్రాక్టివ్‌గా గూగుల్ స్పెషల్ సాంగ్

‘వియర్ ఏ మాస్క్‌’: అట్రాక్టివ్‌గా గూగుల్ స్పెషల్ సాంగ్

న్యూఢిల్లీ: కరోనా కోరలు చాచి భయపెడుతోంది. మహమ్మారి నుంచి సేఫ్‌గా ఉండటానికి మాస్కులు కట్టుకోవడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, హ్యాండ్ శానిటైజర్స్‌ వాడటం తప్పనిసరి అని డాక్టర్స్ సూచిస్తున్నారు. కరోనా బారిన పడకుండా పైజాగ్రత్తలు తీసుకోవాలంటూ పలువరు సింగర్స్ పాటలు రాసిన విషయమూ తెలిసిందే. తాజాగా ఈ కోవలోకి గూగుల్ చేరింది. మాస్కుల వాడకంపై ప్రజల్లో అవగాహన తీసుకురావడంలో భాగంగా ఓ పాటను రిలీజ్ చేసింది. పెప్పీగా, క్రియేటివ్‌గా ఉన్న ఈ మాస్క్ సాంగ్ నెటిజన్స్‌ను ఆకట్టుకుంటోంది. నర్సరీ పిల్లలు పాడుకునే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ రైమ్‌ ట్యూన్‌తో ‘వెన్ ఇన్ పబ్లిక్, వియర్ ఏ మాస్క్‌. ఆన్ యువర్ మౌత్ అండ్ ఆన్ యువర్ నోస్, గుడ్ టూ కవర్ మౌత్’ అనే లిరిక్స్‌తో ఈ పాట మెసేజ్ ఇస్తూ సాగింది.

‘గూగుల్ అసిస్టెంట్‌తో కలసి ఈ పాట పాడండి. హే గూగుల్, కొత్త మాస్క్ పాట పాడు’ అంటూ సాంగ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో గూగుల్‌ పోస్ట్‌ చేసింది. ఈ పాటకు ఇన్‌స్టాలో 42GQ వేల లైక్స్‌ రావడం గమనార్హం.