గూగుల్ సర్వర్ డౌన్.. జీమెయిల్, యూట్యూబ్ లాగిన్ లో ప్రాబ్లమ్

గూగుల్ సర్వర్ డౌన్.. జీమెయిల్, యూట్యూబ్ లాగిన్ లో ప్రాబ్లమ్

సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ సర్వర్‌లు భారతదేశంలోని చాలా ప్రాంతాలలో పనిచేయలేదు. గూగుల్ సంబంధ కంపెనీలు జీమెయిల్, యూట్యూబ్, డ్రైవ్ సర్వర్లు డౌన్‌ అయ్యాయి. దీంతో చాలా ప్రాంతాల్లోని గూగుల్ వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది యూజర్లు ఇమెయిల్‌లను పంపలేకపోయారు. మరికొంతమంది రిసీవ్ చేసుకోలేకపోయారు. 

గురువారం (మార్చి 23) ఉదయం గూగుల్ సర్వర్ డౌన్ అయినట్లు డౌన్‌డెటెక్టర్ నివేదిక ప్రకారం తెలసింది. అంతేకాకుండా సర్వర్ డౌన్ అయిందని భారత్ నుంచి 1,500 కంటే ఎక్కువ కంప్లెయింట్స్ వచ్చాయని గూగుల్ తెలిపింది. ప్రస్తుతం గూగుల్ డౌన్ అంటూ.. హ్యాష్‌ట్యాగ్ ని ట్విట్టర్‌ లో ట్రెండింగ్‌ చేస్తున్నారు.

‘502 సర్వర్ ఎర్రర్.. మీ అభ్యర్థనను పూర్తి చేయడం సాధ్యపడలేదు. దయచేసి 30 సెకన్ల తర్వాత మళ్లీ ప్రయత్నించండి’ అంటూ గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నప్పుడు మెసేజ్ కనిపిస్తుంది. చాలామంది ఈ సమస్యను ట్విట్టర్ లో పోస్టు చేస్తున్నారు. అయితే, గూగుల్ మాత్రం ఈ సమస్యపై ఎలాంటి చర్యలు తీసుకోవడం గానీ, స్పంధించడం గానీ చేయలేదు.