సతాయించిన జీమెయిల్

సతాయించిన జీమెయిల్

జీమెయిల్స్ పోలే..
మెయిల్, డ్రైవ్, ఛాట్ అన్నీడౌన్
సతాయించిన గూగుల్ సర్వీసులు
ప్రపంచవ్యాప్తంగా‘ఎర్రర్ మెసేజ్’

న్యూఢిల్లీ: జీమెయిల్‌ సహా చాలా గూగుల్ సర్వీసులు గురువారం సరిగ్గా పనిచేయలేదు. దీంతో సోషల్ మీడియాలో జీమెయిల్ యూజర్ల నుంచి కంప్లెయంట్స్ వెల్లువెత్తాయి. జీమెయిల్ ద్వారా ఫైల్స్, మెయిల్స్ పంపడం సాధ్యపడలేదని తెలిపారు. అటాచ్‌‌మెంట్లు పంపుకోలేకపోయామని చెప్పారు. అటాచ్‌‌మెంట్ ప్రాసెస్‌ చాలా స్లోగా ఉందని పేర్కొన్నారు. ఫైల్ పూర్తిగా అప్‌లోడ్ అయ్యాక కూడా ఎర్రర్ మెసేజ్ వచ్చిందని చెప్పారు. ‘మీ నెట్‌వర్క్‌‌ను ఒకసారి చెక్ చేసుకోండి’ అంటూ స్క్రీన్‌పై మెసేజ్ దర్శనం ఇచ్చిందని యూజర్లు పేర్కొన్నారు. జీమెయిల్‌లోనే కాక, గూగుల్ డ్రైవ్‌లోనూ ఇదే సమస్య తలెత్తినట్టు చెప్పారు. ఫైల్స్‌‌ను అప్‌లోడ్, డౌన్‌లోడ్ చేసుకోలేక పోయారని తెలిపారు. గూగుల్ డ్రైవ్, జీమెయిల్‌తో
పాటు ఇతర గూగుల్ సర్వీసులు గూగుల్ మీట్, ఛాట్, డాక్స్, గ్రూప్స్, సైట్స్, స్లయిడ్స్, కీప్, వాయిస్‌ వంటి యాప్స్‌‌, వెబ్‌‌సర్వీసులు ప్రపంచవ్యాప్తంగా డౌన్ అయినట్టు తెలిసింది. గూగుల్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఈ–మెయిల్స్ పంపుకోవడానికి సమస్యలు ఉన్నట్టు తెలిపింది. మీట్‌లో రికార్డింగ్ వీడియో కాన్ఫరెన్స్, డ్రైవ్‌లో కొత్త ఫైల్స్‌‌ క్రియేట్ చేసుకునేందుకు, అప్‌లోడ్ చేసుకునేందుకు, చాటింగ్కు సమస్యలు ఎదురైనట్టు చెప్పింది.

For More News..

గీత దాటొద్దు.. ఐపీఎల్ ప్లేయర్లకు బీసీసీఐ హెచ్చరిక

ఆపరేషన్ జరుగుతుండగా ఎమ్మెల్యే మృతి

తెలంగాణలో లక్షకు చేరువలో కరోనా కేసులు