10వేల మంది ఉద్యోగుల్ని తొలగించనున్న గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్

10వేల మంది ఉద్యోగుల్ని తొలగించనున్న గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్

గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ సైతం ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. మెటా, ట్విట్టర్, అమెజాన్ తరహాలోనే ఆల్ఫాబెట్ కూడా 10,000 మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రస్తుతం ఈ కంపెనీలో 1,87,000 మంది పనిచేస్తున్నారు. అయితే పనితీరు సరిగా లేని ఉద్యోగులపైనే వేటు వేయనున్నట్టు ఆల్ఫాబెట్ ప్రకటించింది.

ఉద్యోగుల తొలగింపు విషయంలో ఆల్ఫాబెట్ కూడా మెటా, ట్విట్టర్, అమెజాన్ చెప్పిన మాటలే చెప్తోంది. అంతర్జాతీయంగా నెలకొంటున్న కఠిన పరిస్థితులే లేఆఫ్కు కారణమని అంటోంది. న్యూ ర్యాంకింగ్ అండ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ మెంట్ ప్లాన్ ద్వారా పనితనం సరిగాలేని ఉద్యోగుల జాబితా సిద్ధం చేయాలని బ్రాంచ్ మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ 2023 నుంచి ప్రారంభం కానుంది.