సీఎం రేవంత్​కు ఎమ్మెల్యే రాజాసింగ్ అభినందనలు

సీఎం రేవంత్​కు ఎమ్మెల్యే రాజాసింగ్ అభినందనలు
  • నిమజ్జనానికి ఏర్పాట్లు  బాగా చేశారని ప్రశంస

బషీర్ బాగ్, వెలుగు: గణపతుల నిమజ్జన ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డికి గోషామహల్​బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అభినందనలు తెలిపారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించారని ఆయన ప్రశంసించారు. ముఖ్యమంత్రి స్వయంగా నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించి, భక్తులను కలవడం అభినందనీయమని పేర్కొంటూ సీఎంకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

గణేష్ నిమజ్జనం సందర్భంగా రాజా సింగ్ గోషామహల్ నుంచి బషీర్ బాగ్ వరకు పాదయాత్రగా వచ్చి.. ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు చేసిన ఏర్పాట్లపై కూడా ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. పోలీస్ శాఖ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిందని కొనియాడారు.