Gouher Sultana: 17 ఏళ్ళ కెరీర్‌కు గుడ్ బై.. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్పిన్నర్

Gouher Sultana: 17 ఏళ్ళ కెరీర్‌కు గుడ్ బై.. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్పిన్నర్

భారత లెఫ్టర్మ్ మహిళా స్పిన్నర్ గౌహెర్ సుల్తానా తన 18 ఏళ్ళ క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పింది. శుక్రవారం (ఆగస్టు 22) గౌహెర్ సుల్తానా అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటిస్తూ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. దేశాన్ని అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించడం "గొప్ప గౌరవం" అని సుల్తానా అన్నారు. 2008లో అరంగేట్రం చేసిన సుల్తానా కెరీర్ లో 50 వన్డేలు, 37 టీ20లు ఆడింది.  చివరిసారిగా ఆమె 2014 ఏప్రిల్‌లో ఇండియా తరపున చివరి మ్యాచ్ ఆడింది. సుల్తానా 2024, 2025 ఇండియన్ మహిళల ప్రీమియర్ లీగ్ లో యూపీ వారియర్జ్ తరపున ఆడి క్రికెట్ లోకి కంబ్యాక్ ఇచ్చింది.

వరల్డ్ కప్ లాంటి ఈవెంట్స్ లో దేశానికి ఆడడం న అత్యుత్తమ గౌరవం. తీసిన ప్రతి వికెట్, మైదానంలో ప్రతి డైవ్, నా సహచరులతో మూమెంట్ నాకు అత్యుత్తమ క్షణాలు. ఒక ప్లేయర్‌గా నా కెరీర్‌కు తెరపడినా.. క్రికెట్ పట్ల నాకున్న ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది.  క్రికెట్‌కు నా సేవలను అందించేందుకు నేను ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటాను. ఇది రిటైర్మెంట్ అని నేను అనుకోవడం లేదు. ఇదొక  సువర్ణ అధ్యాయానికి ముగింపు మాత్రమే అని" అని ఇన్‌స్టాలో సుల్తానా రాసుకొచ్చింది. 

సుల్తానా వన్డేల్లో 19.39 సగటుతో 66 వికెట్లు, టీ20ల్లో 26.27 సగటుతో 29 వికెట్లు పడగొట్టింది. 2009, 2013లో రెండు వన్డే వరల్డ్ కప్ లు ఇండియాకు ప్రాతినిధ్యం వహించింది. వన్డే ప్రపంచ కప్‌లలో 11 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు ఆమె తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం సుల్తానా లెవల్ 2 కోచ్ గా ఉంది. 2008లో పాకిస్తాన్ మహిళల జట్టుతో జరిగిన వన్డే ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన ఆమె, ఆ తర్వాత క్రమంగా తనదైన ముద్ర వేసి వన్ ఆఫ్ ది బెస్ట్ స్పిన్నర్ గా పేరు తెచ్చుకుంది.