- ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి
కోటగిరి, వెలుగు : కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలిగించొద్దని ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం మండలంలోని పోతంగల్, కోటగిరి రోడ్డుకు ఇరు పక్కల ఉన్న వడ్ల కుప్పలను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం కోటగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న రైతుల వద్దకు వెళ్లీ మీ సమస్యలు ఎమిటని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంటాలు పెట్టడంలో జాప్యం చేయొద్దని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, లారీలు, రైస్ మిల్లుల వద్ద సమస్యలు ఉంటే చెప్పాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, కోటగిరి సొసైటీ చైర్మన్ కూచి సిద్ధు, జుబేర్, తహసీల్దార్ గంగాధర్, ఏఎంసీ వైస్ చైర్మన్ అనిల్ కులకర్ణి, షాహిద్, కొట్టం మనోహర్ తదితరులు ఉన్నారు.
