టెన్త్​లో ఆరు పేపర్లే.. సిలబస్ 30 శాతం తగ్గింపు

V6 Velugu Posted on Oct 12, 2021

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టెన్త్ క్లాస్ బోర్డు ఎగ్జామ్స్ పేపర్లు, సిలబస్ పై సర్కారు క్లారిటీ ఇచ్చింది. నిరుటి లెక్కనే ఈసారీ ఆరు పేపర్లే ఉంటాయని, 70 శాతం సిలబస్​నే ఎగ్జామ్స్ లో పరిగణనలోకి తీసుకుంటామని ప్రకటించింది. ఈ మేరకు సోమవారం విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వేర్వేరుగా ఉత్తర్వులిచ్చారు. టెన్త్ ఎగ్జామ్స్, సిలబస్​పై సర్కారు సప్పుడు చేయక పోవడంతో ‘‘టెన్త్ సిలబస్ ఎంత? పేపర్లు ఎన్ని?’’ హెడ్డింగ్​తో ఆదివారం ‘వెలుగు’ కథనం ప్రచురించింది. అకడమిక్​​ప్రారంభమై మూడున్నర నెలలైనా టెన్త్​ ఎగ్జామ్స్, సిలబస్​పై సర్కారు స్పష్టతనివ్వకపోవడంతో స్టూడెంట్లు, టీచర్ల ఆందోళన చెందుతున్నారని ‘వెలుగు’  కథనంతో సర్కారులో చలనం వచ్చింది. వెంటనే స్పందించిన ప్రభుత్వం 2020–21లో కొనసాగించిన విధానాన్నే 2021–22 అకడమిక్ ​ఇయర్​లోనూ అమలు చేస్తామని ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఈ ఏడాది కూడా 11 పేపర్లకు బదులు ఆరు పేపర్లతోనే ఎగ్జామ్స్​నిర్వహించనున్నారు.

80 మార్కుల పేపర్...

టెన్త్​లో హిందీ మినహా మిగిలిన అన్ని ఐదు సబ్జెక్టులకు రెండేసి చొప్పున మొత్తం11 పేపర్లు ఉండేవి. నిరుడు కరోనా నేపథ్యంలో సబ్జెక్ట్​కు ఓ పేపర్​ చొప్పున ఆరుకు కుదించారు. అయితే కరోనా ఎఫెక్ట్​తో ఎగ్జామ్స్​ జరగలేదు. ఈ ఏడాది కూడా కరోనా పూర్తిగా తగ్గకపోవడంతో ఆరు పేపర్లే కొనసాగించాలని సర్కారు నిర్ణయించింది. దీంతో 80 మార్కుల పేపర్ కు 3.15 గంటల డ్యురేషన్​తో ఎగ్జామ్ ఉండనుంది. మిగతా 20  ఇంటర్నల్ ​మార్కులుంటాయి. వందశాతం సిలబస్​ను స్టూడెంట్లకు బోధించాల్సి ఉన్నా, ఎగ్జామ్స్​లో మాత్రం 70 శాతం పాఠాలనే పరిగణనలోకి తీసుకుంటారు.  మిగిలిన అన్ని క్లాసులకూ ఎగ్జామ్స్​లో 70 శాతం సిలబస్​నే తీసుకుంటారు. 

ఫస్ట్ వీక్​లో ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్..

ఎగ్జామ్స్​పై క్లారిటీ రావడంతో ఫీజు షెడ్యూల్ రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నవంబర్ ఫస్ట్ వీక్​నుంచి డిసెంబర్ ​వరకు ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎగ్జామ్ ఫీజు పెంచబోమని ఎగ్జామ్స్ విభాగం డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు.  కాగా టెన్త్​బోర్డ్​ ఎగ్జామ్స్​మార్చి‑ఏప్రిల్​నెలలో ఉంటాయని విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

Tagged Telangana, syllabus, Government Clarity, tenth Class Board Exam Papers

Latest Videos

Subscribe Now

More News